Friday, December 20, 2024

రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటీగా ఇల్లందు

- Advertisement -
- Advertisement -

ఇల్లందు : రాష్ట్రస్ధాయిలో వరుసగా రెండోసారి ఇల్లందు మున్సిపాలిటీ ఉత్తమ మున్సిపాలిటీగా తెలంగాణ ప్రభుత్వంచే ఎంపికైంది. రెండో విడత పట్టణ ప్రగతి, డెవ్‌లప్‌మెంట్ ఆఫ్ ఎస్‌హెచ్‌జి గ్రూప్స్, స్ట్రీట్‌వెండర్స్ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అవార్డు అందుకోనుంది. ఈ అవార్డును పురపాలకశాఖ మంత్రి కెటిఆర్ చేతులమీదుగా నేడు హైద్రాబాద్ శిల్పకళావేదిక నందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ అంకుషావళిలు అందుకోనున్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంతటి ఘన విజయానికి కారకులైన స్థానిక శాసన సభ్యురాలు బానోత్ హరిప్రియానాయక్, మున్సిపల్ కౌన్సెలర్స్, అధికారులు, కార్మికులు, పట్టణ ప్రజలకు ధన్యవాదాలు తెలుతున్నామన్నారు. రానున్న రోజుల్లో పట్టణాన్ని మరింత అభివృద్ధి పధంలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News