కూకట్‌పల్లి: కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కూకట్‌పల్లి నియోజకవర్గాన్ని ఆద్శవంతంగా తీర్చిదిద్దుతున్నామని కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం కూకట్‌పల్లి డివిజన్‌లో సుమారు 1కోటి 52 లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్ల నిర్మాణ పనులకు స్ధానిక కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణతో కలిసి ఎమ్మెల్యే కృష్ణారావు శంకుస్ధాపన చేశారు.
ఈ సందర్భంగా కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి కెటిఆర్‌లు నియోజకవర్గం అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలను మంజూరు చేస్తూ సహకరిస్తున్నారన్నారు. అడిగిన వెంటనే నిధులను మంజూరు చేయడంతో నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గంలోని ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కృష్ణారావు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగల అధికారులతో పాటుగా డివిజన్ మాజీ అధ్యక్షుడు ఎర్రవల్లి వాసుదేవరావు, స్ధానిక నేతలు పాల్గొన్నారు.