Monday, December 23, 2024

గ్రామీణాభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం

- Advertisement -
- Advertisement -
  • పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి

పరిగి: గ్రామీణాభివృద్దిలో తెలంగాణ రాష్ట్రం ముందుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రంగాపూర్ గ్రామ పంచాయతీలో ఎన్‌ఆర్ ఈజిఎస్ రూ. 20 లక్షల నిధులతో మంజూరైన నూతన జిపి భవనం నిర్మాణానికి గురువారం ఎంపిపి కరణం అరవింద్‌రావు, స్థానిక సర్పంచ్ లావుడ్యా పెద్ద లక్ష్మీవిజయ్‌నాయక్‌లతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం గ్రామ సీమలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. అనుబంధ గ్రామాలను, ప్రతి గిరిజన తండాను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా మార్చి ప్రజలకు సుపరిపాలన అందేలా చేశారని గుర్తు చేశారు.

ప్రతి పంచాయతీకి ఒక కార్యదర్శిని నియమించి ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులకు చేరేలా చర్యలు తీసుకున్న ఘనత కేసిఆర్‌దేనని అన్నారు. గత ప్రభుత్వాలు గ్రామాల అభివృద్ధిని గాలికి వదిలారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధితోపాటు మంచి పాలన అందుతుందని తెలిపారు.

మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాలలో ప్రత్యేక పారిశుద్ధ కార్మికులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు చెత్త చెదారం, మురికిని తొలగించేలా చర్యలు చేపట్టామన్నారు. చెత్త సేకరణకు ట్రాక్టర్ సౌకర్యం, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు, వర్మీ కంపోస్ట్ షెడ్డ్‌లు, వైకుంఠధామాలు, వీది దీపాలకు విద్యుత్ సౌకర్యం, సిసి రోడ్లు, మురుగు కాల్వలు, పానాదులకు బాటలు, రైతులకు కల్లాలు ఈ విధంగా ఎన్నో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని అన్నారు. వీటితో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయని తెలిపారు. పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారికి డ్రెస్సులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి కరణం అరవింద్‌రావు, సర్పంచ్ లావుఢ్యాలక్ష్మీ విజయ్‌నాయక్, ఎంపిడిఓ శేషగిరిశర్మ, ఏఎంసీ ఛైర్మన్ సురేందర్, సీనియర్ నాయకుడు ప్రవీణ్‌రెడ్డి, సోసైటీ వైస్ ఛైర్మన్ భాస్కర్, పిఆర్ డిఈ సుదర్శన్‌రెడ్డి, ఎంపిఓ దయానంద్, పొల్కంపల్లి సర్పంచ్ మధుసూదన్‌రెడ్డి, జేఏసి రవికుమార్, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, పంచాయతీ కార్యదర్శి విశ్వతేజ, బిఆర్‌ఎస్ గ్రామ కమిటి అధ్యక్షుడు నాగేందర్‌రెడ్డి, వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News