Monday, December 23, 2024

ఓటరు జాబితాను పకడ్బందీగా రూపొందించాలి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి : జిల్లాలో రెండవ విడత ఓటరు నమోదు కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని, అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఓటు హక్కు కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల సన్నద్దతలో భాగంగా ఓటరు జాబితాపై కలెక్టర్ సంబంధించిన అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఓటరు నమోదు కార్యక్రమంపై 25 ప్రశ్నలతో కూడిన గూగుల్ స్ప్రెడ్షిట్ ఆన్‌లైన్ క్విజ్ నిర్వహించారు. ఈ క్విజ్ ద్వారా చాలా మందికి సక్రమంగా నిర్వహించకపోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ద కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు భారత ఎన్నికల కమిషన్ జూన్ 23న ప్రత్యేక సమావేశం నిర్వహిస్తుందని, దీని కోసం సంపూర్ణ సమాచారంతో సిద్ధం కావాలని అన్నారు.

రెండవ విడత ఓటర్ నమోదు కార్యక్రమం కోసం బూత్ స్థాయి అధికారులు ఇంటింటి సర్వే జూన్ 23 నాటికి పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికి కొన్ని మండలాల్లో చాలా తక్కువ మొత్తంలో ఇంటింటి సర్వే జరగడం పట్ల కలెక్టర్ అంసతృప్తి వ్యక్తం చేశారు. బూత్ స్థాయి అధికారులను తహసీల్దారులు ప్రతి రోజు పర్యవేక్షించాలని, రోజు ఇంటింటికి తిరుగుతూ వివరాలు సేకరించేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఇంటింటి సర్వే నిర్వహించి పోలింగ్ కేంద్రాల వారిగా ఉన్న ఇండ్ల సంఖ్య, సర్వే చేసిన ఇండ్లు, కొత్తగా నమోదు చేయాల్సిన ఓటర్లు, శాశ్వతంగా తొలగించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, ఓటరు కార్డులో సవరణలు మొదలగు అంశాలపై నివేదికలను ఈఆర్‌ఓ నెట్ ద్వారా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

గత ఎన్నికల నుండి ఇప్పటి వరకు నూతనంగా నమోదు చేసిన ఓటర్ల వివరాలు, ఓటరు జాబితాలో వచ్చిన మార్పులు, తొలగించిన ఓటర్లను క్షేత్రస్థాయిలో జరిపిన ధృవీకరణ ప్రక్రియ వాటిపై నివేదిక తయారుచేసి సమర్పించాలని, బూత్ స్థాయి అధికారులకు, విఆర్‌ఓలకు ఓటరు జాబితా రూపకల్పన ఏరోనేట్ 2.0, బిఎల్‌ఓ యాప్‌పై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో భూపాలపల్లి ఆర్‌డిఓ శ్రీనివాస్, 6 మండలాల తహసీల్దార్లు, డిటిలు, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News