Saturday, December 21, 2024

నిస్వార్థపరుడిపై బిజెపి ఐటి దాడులు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : ప్రజాసేవే పరమావధిగా రాజకీయాల్లోకి వచ్చిన మర్రి జనార్ధన్ రెడ్డిపై ఐటి దాడులు చేసి పొలిటికల్ బ్లాక్ మెయిల్ చేస్తున్న బిజెపికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల మనసు గెలవాలంటే ప్రేమగా ఉండాలి తప్ప కక్ష సాధించేందుకు ప్రయత్నిస్తే ఈ చైతన్యవంతమైన నేల సహించదని ఆయన అన్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చి వ్యాపారాల్లో ఎంతో ఎత్తుకు ఎదిగి తాను సంపాదించిన డబ్బులతో ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాల్లోకి వచ్చిన మర్రి జనార్ధన్ రెడ్డి ప్రజాధారణను ఓర్వలేక ఐటి దాడులు నిర్వహించారని ఆయన అన్నారు.

ఇదే కేంద్రం ప్రపంచ కుభేరులు అని చెప్పుకునే తమ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి అంబాని, ఆధానిలపై ఎన్ని సార్లు ఐటి దాడులు చే శారో ప్రజలకు చెప్పాలని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుజనా చౌదరి, సిఎం రమేష్ వంటి వారిపై ఇలాగే దాడులు జరిపి తమ పార్టీలో చేర్చుకోగానే పవిత్రులైనట్లు అధర్మ బద్ధంగా పాలన సాగిస్తున్న బిజెపి కేవలం బిఆర్‌ఎస్‌ను రాజకీయంగా ఎదుర్కొలేకనే ఇలాంటి దాడులకు పాల్పడుతుందన్నారు. గత 25 సంవత్సరాల నుండి వ్యాపార రంగంలో ప్రత్యక్షంగా 15 వేల మంది కి ఉపాధి కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే రిటైల్ రంగంలో అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్‌గా రెండు సార్లు అవార్డు తీసుకున్న వ్యక్తి మర్రి జనార్ధన్ రెడ్డి అని అన్నారు.

రిటైల్ రంగంలో జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను కూడా పొందారన్నారు. వ్యాపారంలో తాను సంపాదించిన డబ్బులను పేద ప్రజలకు ఉపయోగించాలనే ఉద్దేశంతో తన తండ్రి పేరుతో ఎంజెఆర్ చారిటబుల్ ట్రస్ట్‌ను ప్రారంభించి నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో ఎంతో మంది నిరుపేద ఆడబిడ్డలకు అంగరంగ వైభవంగా కనివిని ఎరుగని రీతిలో సామూహిక వివాహాలు చేసిన ఏకైక వ్యక్తి మర్రి జనార్ధన్ రెడ్డి అని, సామూహిక వివాహాలతో పా టు ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల ఉన్నత చదువులకై తన ట్రస్ట్ ద్వారా సహాయ ం చేశారన్నారు.

వికలాంగులకు కృత్రిమ అవయవాలు పంపిణీ చేసారని, కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తు న్న సందర్భంలో నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో నిరుపేద ప్ర జలకు అండగా ఉండి నిత్యావసర సరుకులు, కొవిడ్ కిట్స్‌ను కొ విడ్ సోకిన రోగులకు అందజేశారన్నారు. తన సొంత డబ్బుల తో ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ పాఠశాలలకు తీసిపోని విధం గా కట్టిస్తూ, ఆధ్యాత్మిక చింతనకై గుడులు నిర్మిస్తూ ట్రస్ట్‌తో పాటు ప్రభుత్వ పథకాలు చిత్తుశుద్ధితో ప్రజల వద్దకు చేర్చడమే కాకుండా కందనూలును మరో హైదరాబాద్‌లాగా అభివృద్ధి చేస్తూ, నాగర్‌కర్నూల్‌ను జిల్లా చేసి మెడికల్ కాలేజీని తీసుకువచ్చి, కెఎల్‌ఐ ద్వారా సాగునీటితో రైతు కళ్లల్లో ఆనందాన్ని నింపారన్నారు.

ఏ ఒక్క రంగాన్ని నిర్లక్షం చేయకుండా విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి కల్పనలతో కందనూలు కలలను సాకారం చేస్తూ ప్రతి ఇంట్లో మనిషిలాగా, ప్రజల హృదయాల్లో చెరుగని ముద్ర వేసుకున్న ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డిని రాజకీయంగా ఢీ కొనలేక ఐటి దాడులు చేయడం పిరికిపంద చర్యనే అని డిసిసిబి డైరెక్టర్ జక్కార ఘునందన్ రెడ్డి అన్నారు. ఐటి రైడ్స్ తర్వాత కడిగిన ముత్యంలా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బయటికి వస్తాడని, నియోజకవర్గ పరిధిలోని ప్రజలంతా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలుకుతారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News