Monday, December 23, 2024

రాష్ట్రంలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ : రాష్ట్రంలో గ్రామాలన్నీ ప్రగతి పథంలో పయనిస్తున్నాయని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మహబూబ్‌నగర్ జిల్లా, హన్వాడ మండల కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హన్వాడ మండలాన్ని పాలమూరు… రంగారెడ్డి ఎత్తిపోతల ప థకం కింద చేపట్టిన కర్వెన రిజర్వాయర్ ద్వారా సస్యశ్యామలం చేస్తామని, నియోజకవర్గంలోని ప్రతి చెరువును, కాలువను నింపి సాగునీరు అందిస్తామన్నారు. పాలమూరు…రంగారెడ్డి పూర్తి అయితే మహబూబ్‌నగర్ నియోజకవర్గం మొత్తం సస్యశ్యామలం అవుతుందని, హన్వాడ మండలంలో ఇది వరకే కొన్ని చెక్ డ్యాంలు నిర్మించగా, మరో నాలు గు కొత్తగా మంజూరయ్యాయని, దీంతో పాటు, అ న్ని గ్రామాలలో రోడ్లు వేయడం జరిగిందని, ప్రతి గ్రామానికి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేష న్ షెడ్లు ఇచ్చామని తెలిపారు. మండలంలోని కొనగంటి పల్లి గ్రామం పల్లె ప్రగతి కార్యక్రమాలను బాగా అమలు చేసి అవార్డును సాధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

హన్వాడ మండలంలో తెలంగాణ రాక ముందు పెన్షన్ల కింద సంవత్సరానికి కోటి 30 లక్షలు ఇస్తే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తాము హన్వాడలో నెలకు కోటీ 3 3 లక్షలు ఇస్తున్నామని, పెన్షన్ల రూపేనా మండల ంలో సంవత్సరానికి 130కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు.1626 మందికి కళ్యాణ లక్ష్మిఇచ్చామని, రైతుబంధు కింద 15,539 మందికి 1 33 కోట్లు ఇ చ్చామని, 271 మంది రైతులు చనిపోతే ఒక్కొక్కరి కి ఐదు లక్షల చొప్పున వారి కుటుంబాలకు ఇచ్చామని,111 కోట్లు స్వయం సహాయ మహిళా సం ఘాలకు రుణాలు ఇచ్చామని, తాగునీటి కోసం 35 కోట్లు ఖర్చు చేసామని, ఇప్పుడు ఇంటి ముందరికే తాగునీరు, కెసిఆర్ కిట్ వంటివి వస్తున్నాయని మ ండలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని హాస్టల్‌లో ఏర్పా టు చేసామని, మహిళా జూనియర్ కళాశాల ఏర్పాటు చేశామని, త్వరలోనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చే స్తామని, ఐటి పార్కు, పుడ్ పార్క్ ద్వారా యువతకు ఉన్న చోటనే ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ఎం పీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, డిపిఓ వె ంకటేశ్వర్లు, డిఆర్‌డిఒ యాదయ్య, ఆర్డీఓ అనిల్‌కుమార్, ఏపిడి శారద , తహసీల్దార్ బక్క శ్రీనివాసు లు, ఎంపీడీఓ ధనంజయగౌడ్, సర్పంచ్ రేవతి, జి ల్లా రైతు బంధు అధ్యక్షుడు గోపాల్ యాదవ్, మండల స్థాయి నాయకులు బాలయ్య, లక్ష్మయ్య, పిఏసిఎస్ అధ్యక్షులు వెంకటయ్య, కరుణాకర్‌గౌడ్, ఎ ంపిటిసి సత్యమ్మ తదితరులు ఉన్నారు.అనంతరం మంత్రి డ్వాక్రా స్టాల్‌ను సందర్శించారు. జాతీయ స్థాయిలో అవార్డు పొందిన కొనగట్టుపల్లి సర్పంచుతో పాటు, ఇతర సర్పంచులు, ప్రజాప్రతినిధులను సన్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News