Tuesday, January 14, 2025

నకిలీ ల్యాబ్‌లకు ఆర్‌ఎంపిల అండ?

- Advertisement -
- Advertisement -

గోవిందరావుపేట: మండలంలోని కొంత మంది ఆర్‌ఎంపిలు, పిఎంపిలు ధనార్జనే లక్షంగా సిండికేట్‌గా మారారు. అర్హతలు, అనుమతులు వీరికి గాని, రోగనిర్ధారణ పరీక్ష కేంద్రాలకు గాని లేకపోయినప్పటికి వీరి వద్దకు వస్తున్న పేషెంట్లకు అవసరం ఉన్నా లేకపోయిన రోగ నిర్ధారణ పరీక్షలు రాసి ఆ పరీక్షల కోసం వెళ్లిన రోగుల వద్ద టెస్టుల పేరుతో ల్యాబ్ యజమానులు అధిక మొత్తంలో పరీక్ష ఫీజులు వసూలు చేస్తున్నారు.

పస్రా గ్రామంలో ఇటీవల వెలుగులోకి వచ్చిన సంఘటన నకిలీ లక్ష్మీ ల్యాబ్‌కు కొందరు ఆర్‌ఎంపిలు వీరికి కిడ్నీ, లీవర్ సంబంధిత పరీక్షలు రాసే అర్హతలు వీరికి లేకపోయిన కేవలం కమిషన్ల కోసమే ఈ పరీక్షలు రాసి ముఠాగా ఏర్పడి కమిషన్ కోసం అవసరం ఉన్న లేకపోయిన రోగ నిర్ధారణ పరీక్షలు రాసి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి తప్పుడు రిపోర్టులు ఇస్తూ డబ్బే ధ్యేయంగా పనిచేస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇంత జరుగుతున్న గత రెండు నెలల నుండి ఈ విషయంపై వివిధ దినపత్రికలల్లో కథనాలు ప్రచురించిన జిల్లా వైద్యాధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరించడంపై ఆంతర్యం ఏమిటని, ఇకనైనా ఉన్నత వైద్యాధికారులు స్పందించి అర్హతలు లేని ఆర్‌ఎంపిలు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News