Friday, December 20, 2024

సమస్యలు పరిష్కరించినందుకు క్షీరాభిషేకం

- Advertisement -
- Advertisement -

చెన్నారావుపేట: మండలంలోని ముగ్దుంపురం గ్రామానికి చెందిన రైతులు ఎస్సై తోట మహేందర్, ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదయ్యగౌడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే.. రబీ సీజన్‌లో రైతులు ముగ్ధ్ధుంపురం ఐకేపీ సెంటర్‌లోని ముగ్ధుంపురం, పాత ముగ్ధుంపురం, కాకతీయనగరం, రాజపల్లి, చెన్నారావుపేట గ్రామాలకు చెందిన 600 మంది చిన్న, సన్నకారు రైతులు 35 వేల బస్తాల వరి ధాన్యం అమ్మారు. మద్దతు ధర లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న మాకు అధికార పార్టీ నాయకులు, రైస్‌మిల్ యాజమాన్యం, ఐకేపీ సెంటర్ వారితో కుమ్మక్కై తరుగు, తాలు పేరుతో మూడు కిలోల చొప్పున ఒక బస్తాకు కటింగ్ చేస్తుండగా ఎమ్మెల్యే, అధికారులు, ఎస్సై వచ్చి ఒక బస్తాకు రెండు కిలోల చొప్పున తరుగు తీయాలన్నారు. దీని ప్రకారం ఐకేపీ సెంటర్ వారు కాంటాలు పెట్టారు. డబ్బులు చెల్లించే సందర్భంగా మూడు కిలోల చొప్పున తరుగు కట్ చేస్తుండగా ఈ విషయాన్ని స్థానిక ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదయ్యగౌడ్ పార్టీలకతీతంగా రైతులందరిని ఏకం చేసి నెక్కొండ-నర్సంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేయగా స్థానిక ఎస్సై తోట మహేందర్ తక్షణమే స్పందించి ఐకేపీ సెంటర్ వారి దగ్గరకు తీసుకపోయి సదరు రైస్‌మిల్ యాజమానులను పిలిపించి మాకు న్యాయం చేశారన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ, ఎస్సై చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు రైతులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News