Saturday, November 16, 2024

పచ్చదనం పరిశుభ్రతతో సరికొత్తగా గ్రామాలు

- Advertisement -
- Advertisement -

హసన్‌పర్తి: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం మండలంలోని మడిపల్లి గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి దినోత్సవ వేడుకల్లో హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రా మాల భివృద్ధే దేశ ప్రగతికి నిదర్శనమని భావించి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతే లక్షంగా ప్రభుత్వం మన పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇందులో భాగంగానే గ్రామాల్లో పేరుకపోయిన చెత్తా చెదారం, మురుగు కాలువలను శుభ్రపర్చడం, పరిసరాల శుభ్రత, ఎవెన్యూ ప్లాంటేషన్, నర్సరీ, డంపింగ్ యార్డుల్లో పిచ్చి మొక్కల తొలగింపు, వైకుంఠధామాల నిర్మాణం, నాన్‌వెజ్ మార్ట్లె నిర్మాణం తదితర కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలు పరిశుభ్రతతో ఉన్నాయన్నారు

. అటవీ శాతం పెంచాలనే ఉద్దేశంతో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున గ్రామాల్లో మొక్కలు పెంపకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ డీఆర్‌డీఓ శ్రీనివాస్‌కుమార్, స్థానిక సర్పంచ్ చిర్ర సుమలత, జడ్పీటీసీ సునీత, మండల రైతు బంధు కోఆర్డినేటర్ అంచూరి విజయ్‌కుమార్, ఉపసర్పంచ్ రంజీత్‌కుమార్, తహసీల్దారు నాగేశ్వర్‌రావు, ఎంపీడీఓ రామకృష్ణ, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు, మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News