Friday, December 20, 2024

గుండెపోటుతో ఇద్దరు మృతి

- Advertisement -
- Advertisement -

నెన్నెల : నెన్నెల మండలంలో గుండెపోటుతో ఇద్దరు మృతి చెందారు. కోనంపేట గ్రామానకి చెందిన ప్రముఖ ఒగ్గు కథ కళాకారుడు గుంటి శ్రీశైలం (58) గురువారం ఉదయం గుండెపోటు రావడంతో కుటుం సభ్యులు చికిత్స కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

పరిస్ధితి విషయంగా ఉండడంతో అక్కడ నుండి కరీంనగర్ ఆసుపత్రికి తరలించగా మార్గ మద్యంలో మృతి చెందినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉండగా ఆవడం గ్రామ పంచాయతీ పారిశుద్య కార్మికుడు కా మెర శ్రీనివాస్ అనే యువకుడు బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు.

ఆ యువకుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సంవత్సరం క్రితం తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా కొడుకు గుండెపోటుతో మృతి చెందడం పట్ల ఆ కుటుంబం శోకసం ద్రంలో మునిగిపోయింది. ఈ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. మృతుల కుటుంబాలను ఎంపీపీ సంతోసం రమాదేవి, సర్పంచ్‌లు చీర్ల సత్తమ్మ మొండన్న, తిరుపతిరెడ్డి, ప్రజా ప్రతినిధులు ఆ కుటుంబాలను పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News