Monday, December 23, 2024

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 500కే గ్యాస్ సిలెండర్

- Advertisement -
- Advertisement -

రెంజల్ : మరో ఐదారు నెలల్లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.500కే సిలెండర్ అందిస్తామని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని తాడ్‌బిలోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపు మేరకు గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గడపగడపకు తీసుకుపోయి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరవేసేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఎన్నికలకు ముందు సిఎం కెసిఆర్ రైతులకు రుణ మాఫీ చేస్తామని చెప్పి విస్మరించారని,

నిరుద్యోగులకు జీవన భృతి, అర్హులకు పెన్షన్లు అందజేయడంలో పూర్తిస్థాయిలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ఆదరణను జీర్ణించుకోలేక కేంద్రంలో బిజెపి ఆయనను ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లాఅధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షుడు మబిన్‌ఖాన్, జిల్లా ఉపాధ్యక్షుడు అంతిరెడ్డి డిసిసి మాజీ ప్రధాన కార్యదర్శి జావీదొద్దీన్, కాంగ్రెస్ బిసి సెల్ మండల అధ్యక్షుడు లచ్చావార్ నితిన్, గ్రామ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్, నాయకులు మొల్ల పాషా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News