యాదాద్రి : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తులు ఆలయ నిత్యపూజలలో పాల్గొని దర్శించుకున్నారు. గురువారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో పూజలు ప్రారంభించిన అర్చకులు అర్చన, అభిషేకం అనంతరం భక్తులకు సర్వదర్శనాలు కల్పించారు. శ్రీవారి దర్శనానికి కుటుంబ సభ్యులు, పిల్లాపాపలతో కలిసి వచ్చిన భక్తులు శ్రీలక్ష్మీనరసింహుని దర్శనము తోపాటు, నిత్యకల్యాణం, సువర్ణ పుష్పార్చన, సుదర్శన నారసింహ హోమం, వెండి జోడి సేవ, శ్రీసత్యనారాయణ వ్రతపూజలలో భక్తులు పాల్గొని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. కొండపైన అనుబంధ ఆలయం శ్రీరామాలింగేశ్వర స్వామి శివాలయంలో భక్తులు శివ దర్శనము చేసుకొని పూజలు నిర్వహించారు.
కొండకింద అనుబంధ ఆలయం శ్రీపాతలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా భక్తులు సందర్శించి ఆలయ నిత్యపూజలలో పాల్గొని శ్రీవారి దర్శించుకున్నారు.
హుండీలు అందచేసిన భక్తుడు.. శ్రీలక్ష్మీనరసింహస్వామి యాదాద్రి ఆలయానికి రూ.మూడున్నర లక్షల విలువచేసే రెండు బట్ట హుండీలు, 3 సాధారణ హుండీలను హైరాబాద్‌కు చెందిన ఉప్పల సుభాష్ అందజేశారు. గురువారం కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించకున్న భక్తుడు ఆలయ అధికారులకు హుండీలను అందజేశారు.