పెద్దపల్లి: ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్టణంలో వార్డుల సందర్శనలో భాగంగా రెండవ రోజు రెండవ వార్డులో పర్యటించారు. వార్డులో గల అన్ని గల్లీలను పరిశీలించి, అక్కడి ప్రజలతోని వార్డు అభివృద్ధి గురించి చర్చించారు. వార్డులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్ర మాలను, వార్డు ప్రజలే సొంత పనులు లాగా దగ్గరుండి చూసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
వార్డులో వచ్చిన చిన్న చిన్న సమస్యలను వార్డు పెద్దలు కలిసి చర్చించుకుని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. ఒకనాడు రెండో వార్డుకు వర్షం పడితే ఎక్కడి అక్కడ నీరు నిలిచి చెరువుల దర్శనం ఇచ్చేవని, క్రమక్రమంగా డ్రైనేజీల నిర్మాణాలు, సీసీ రోడ్ల నిర్మాణాలు చేసి గురువారం వార్డును దాదాపుగా పూర్తిస్థాయిలో సమస్యలను పారదోలే దిశలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో వార్డులోని అన్ని డ్రైనేజీలు, రోడ్ల నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే చాలా రోడ్లు, డ్రైనేజీలు నిర్మా ణం కోసం పరిపాలన అనుమతులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ప్రతి గల్లీకి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుపోవడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు పస్తెం హన్మంతు, వార్డు అధ్యక్షుడు తక్దీర్, యూత్ అధ్యక్షుడు నాగరాజు, నాయకులు ఈదునూరి జైపాల్, గంధం రవి, కోటేష్, సాగర్, క్యాతం రమేష్, వెంకన్న, ఉజ్జల నర్సయ్య, శంకరయ్య, రమేష్, భిక్షపతి, వార్డు ప్రజలు పాల్గొన్నారు.