జగిత్యాల: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాల పల్లెల అభివృద్ధికి సిఎం కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెల అభివృద్ధికి సిఎం కెసిఆర్ పక్కా ప్రణాళిక రూపొందించారని జగిత్యాల ఎంఎల్‌ఎ డాక్టర్ సంజయ్‌కుమార్ అన్నారు.
జగిత్యాల రూరల్ మండలం గొల్లపల్లె గ్రమంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు, పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి, రూ.5 లక్షలతో సిసి రోడ్డు నిర్మాణానికి జడ్‌పి చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి గురువారం జగిత్యాల ఎంఎల్‌ఎ సంజయ్‌కుమార్ భూమి పూజ చేశారు.
గ్రామంలో సార్గమ్మ దేవతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా గ్రామంలో 11 మంది లభ్దిదారులకు రూ.10, 26,000 అందజేశామన్నారు. 110 మంది లభ్దిదారులకు ఇప్పటి వరకు రూ.58 లక్షలు రైతుబంధు ద్వారా మంజూరయ్యాయని అన్నా రు.
ఇద్దరు రైతులు వివిధ కారణాలతో మరణిస్తే ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు మంజూరు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రకాశ్, ఎంపిపి రాజేంద్రప్రసాద్, ఫ్యాక్స్ చైర్మన్ మహిపాల్‌రెడ్డి, ఎంపిటిసి మమత, ఉప సర్పంచ్ తిరుపతి, సిఇ ఓ రామాంజనేయులు, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎంఆర్‌ఓ నవీన్, ఎంపిఓ రవి బాబు, డిఇ మిలింద్, ఎఇ రాజ మల్లయ్య, సర్పంచ్‌లు బుర్ర ప్రవీణ్, సరోజన మల్లారెడ్డి, సదాశివరావు, గంగ నీలయ్య, నాయకులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.