కరీంనగర్: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేలా జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించి తగి న చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ తెలిపారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం నిర్ధేశించిన మేరకు ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్మాత్మక పోలింగ్‌స్టేషన్లను గుర్తించి అవసరమైన చర్యలను తీసుకో వాలని సూచించారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఎన్నికలనిర్వహణ తీసుకోవాల్సిన చర్యలపై సమావేశాలను నిర్వహించాలని, ని యోజకవర్గాల వారీగా రిసెష్పన్ కేంద్రాలు, కౌటింగ్ కేంద్రాలను గుర్తించాలని, ఇంటింటి సర్వేను నిర్వహించి ఓటరు జాబితాను మరోసారి సరిచూసుకోవాలన్నారు.
అభ్యంతరాలు తెలుపుతూ వచ్చే దరఖాస్తులపై తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో నివేదికలను రూపొందించి పంపించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కమీషనర్ సుబ్బారాయుడు, అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్, టైనీ కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్సో, జడ్పీ సీఈవో ప్రియాంక, డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ తుల శ్రీనివాస్, కరుణాకర్, వెంకట్ రెడ్డి, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డీవోలు ఆనంద్‌కుమార్, హరిసింగ్, తహసిల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.