పెద్దపల్లి: పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల స్వరూపం పూర్తిగా మారిందని, మన గ్రామాల అభివృద్దే దేశాభివృద్ధికి కీలకమని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మండలంలోని ముత్తారం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గురువారం పల్లె ప్రగతి దినోత్సవంలో ఏర్పాటు చేసినగ్రామసభలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. పల్లె ప్రగతి దినోత్సవంలో భాగంగా ముత్తారం గ్రామపంచాయతీలో చేపట్టిన అభివృద్ధి పనులు, పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు గ్రామపంచాయతీ భవనం ఆవరణ లో గ్రామ సర్పంచ్ జాతీయ పతాకావిష్కరణ చేశారు.
అనంతరం పంచాయతీ భవన ఆవరణలో గ్రామసభ నిర్వహించి 9 ఏళ్లలో గ్రామంలో జరిగిన అభివృద్ధి కర్యక్రమాలను వివరిస్తూ ప్రగతి నివేదిక చదివి వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 266 గ్రామపంచాయతీలలో పల్లె ప్రగతి దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ప్రభుత్వం గ్రామాలలో వివిధ వర్గాల వారికి వ్యక్తిగతంగా లబ్ది చేకూరుస్తూ, జీవన ప్రమాణాలు మెరుగు పరిచే దిశగా కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్, రైతుబంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్ ఆరోగ్యలక్ష్మీ, కోతలు లేని పథకాలను అమలు చేస్తుందని, ప్రతి ఇంటి నుంచి ప్రభుత్వం పథకాల ద్వారా ల బ్ది పొందిన వారు ఉన్నారని కలెక్టర్ తెలిపారు.
ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఏర్పాటు చేయడం వల్ల పారిశుద్యం మెరుగుపడిం దని, ప్రతి రోజు చెత్త సేకరణ జరుగుతుందని, దీని వల్ల దోమలు, ఈగలు తగ్గిపోయి ప్రజలు ఆరోగ్యంగా ఉంటున్నారని కలెక్టర్ తెలిపారు. చిన్న, చిన్న మార్పుల వల్ల అద్భుత ప్రగతి సాధ్యమవుతుందన్నారు. గతంలో పోలిస్తే పారిశుధ్యం గ్రామాల్లో గణనీయంగా పెరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, స్మశాన వాటిక, డంపింగ్‌యార్డు, నర్సరీ, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసుకున్న రాష్ట్రం తె లంగాణ మాత్రమేనని, దేశంలో మరే రాష్ట్రంలో గ్రామాలలో ఇలాంటి వసతులు లేవని కలెక్టర్ తెలిపారు.
గ్రామంలో నర్సరీ ఏర్పాటు చేసుకొని హరితహారం కార్యక్రమం కింద మొక్కలు నాటి సంరక్షిస్తున్నామని, పల్లె ప్రకృతి వనం అద్భుతంగా ఏర్పాటు చేసుకొని ఆహ్లాదకర మైన వాతావరణాన్ని సృష్టించడంలో సఫలీకృతమయ్యామని కలెక్టర్ తెలిపారు. ప్రగతి బాటలో ముత్తారం గ్రామపంచాయతీ పయణి స్తుందని, గ్రామపంచాయతీలో రూ.10.71 లక్షల ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేసి తడి, పొడి చెత్త వేరు వేరు చేయడం ద్వారా రూ.20,500 ఆదాయం వచ్చిందన్నారు.
గ్రామంలో రూ.3.20 లక్షలతో డంపింగ్ యార్డు, 11.51 లక్షలతో స్మశాన వాటిక, రూ.2.22 లక్షలతో నర్సరీ, రూ.8.86 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.4.85 లక్షల సిమెంట్ రోడ్డు నిర్మాణం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ స్రవంతి, సర్పంచ్ ఎద్దు కుమారస్వామి, జిల్లా సహకార అధికారి మైకల్ బోస్, ఎంపీడీఓ రాజు, మండల పంచాయతీ అధికారి సుదర్శన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.