హైదరాబాద్ : జూనియర్ షూటింగ్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన షూటింగ్ క్రీడాకారుడు ధనుష్ శ్రీకాంత్ ను రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. జూన్ 1 నుండి 7 వరకు జర్మనీలో జరిగిన జూనియర్ షూటింగ్ వరల్డ్ కప్‌లో గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ హైదరాబాద్ కు చెందిన ధనుష్ శ్రీకాంత్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో గోల్డ్ మెడల్‌ను, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో సిల్వర్ డల్‌లను సాధించారు. హైదరాబాదులో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను గురువారం కలువగా ఆయన అభినందించి మాట్లాడుతూ ఒలంపియాన్ గగన్ నారంగ్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ – గగన్ నారంగ్ షూటింగ్ అకాడమీ లు షూటింగ్ లో అద్భుతమైన క్రీడాకారులను తెలంగాణ రాష్ట్రం గర్వపడేలా దేశానికి అందజేస్తున్నాయన్నారు. ధనుష్ శ్రీకాంత్ చెవిటి మూగ అయినప్పటికీ ఓపెన్ కేటగిరీలో షూటింగ్ లో అంతర్జాతీయ పతకాలను సాధించడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి దేశానికి సరిపడే క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రీడా పాలసీని రూపొందిస్తున్నామన్నారు. ఇటీవల ప్రపంచ స్థాయి చాంపియన్ షిప్ లలో తెలంగాణకు చెందిన క్రీడాకారులు అత్యంత ప్రతిభను కనబరిచి దేశంలో ఇతర రాష్ట్రాల క్రీడాకారుల కంటే ఎక్కువ పతకాలు సాధిస్తున్నారన్నారు. ఇటీవల జరిగిన కామన్వెల్త్ గేమ్స్ లో రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు దేశంలోనే మూడో స్థానం సాధించారన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి పేరు తెస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి నగదు బహుమతి, ఇంటి స్థలాలను అందజేసి ప్రోత్సహిస్తున్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రానికి పేరు తెచ్చేలా మరిన్ని పథకాలు తేవాలని క్రీడాకారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో రోలర్ స్కేటింగ్ అంతర్జాతీయ ఆటగాడు, అర్జున అవార్డు గ్రహీత అనూప్ యామ, హైదరాబా ద్ జిల్లా డివైయస్‌ఓ సు ధాకర్, ఆ శా శ్రీకాంత్ అరుణ్ నాయక్ గగన్ నారంగ్ అకాడమీ ప్రతినిధులు పాల్గొన్నారు.
గోల్డ్ మెడల్ షూటింగ్ క్రీడాకారుడు ధనుష్ శ్రీకాంత్‌కు అభినందన
- Advertisement -
- Advertisement -
- Advertisement -