Friday, November 22, 2024

ఆధార్ ఉచిత ఆప్‌డేట్ గడువు పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. ఈ క్రమంలో, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మై ఆధార్ పోర్టల్ ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్చి 15 నుంచి ఇది అమలులో ఉండగా మరోసారి ఈ ఫ్రీ అప్ డేట్ గడువు జూన్ 14కు పెంచారు.

గడువు ముగియడంతో మళ్లీ వినియోగదారుల సౌకర్యార్థం సెప్టెంబర్ 14వ తేదీ వరకు పొడిగించినట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ విభాగం తెలిపింది.. వినియోగదారులు ఆధార్ అప్ డేట్ కోసం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ సాయంతో ఆధార్ ను ఎవరైనా అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News