సిటీ బ్యూరో: సుపరిపాలనే లక్షంగాగ్రేటర్ హైదరాబాద్‌లో నేటినుంచి సరికొత్త పాలన అందుబాటులోకి రానుంది. జిహెచ్‌ఎంసి పరిధిలో సమస్యల పరిష్కారంలో నగర వాసులకు మరింతగా చేరువయ్యేందుకు పాలన వికేంద్రీకరణలో భాగంగా విన్నూతంగా నగరంలో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చు ట్టారు. ప్రసుత్తం గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రధాన కార్యాలయం, జోనల్, సర్కిల్ ఇలా మూండంచెల పరిపాలన వ్యవస్థ ఉండగా కొత్తగా వార్డు పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. దేశంలోనే మొట్ట మొదటిసారిగా అమల్లోకి తీసుకువస్తున్న ఈ సరికొత్త వి ధానం ద్వారా వార్డు కార్యాలయాలే కేంద్రంగా నగరవాసుల సమస్యలను సత్వరమే పరిష్కారించడంతో పాటు మరింత పారదర్శకతతో సేవలందించనున్నారు.
ఇం దుకు సంబంధించి గ్రేటర్‌లోని ప్రతి డివిజన్‌కు ఒక్కటి చొప్పున 150 వార్డు కార్యాలయాలను సిద్దం చేశారు. లాంఛనంగా ప్రారంభించనున్నారు. శుక్రవారం ఉద యం 10 గంటలకు పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు కాచిగూడ వార్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అదేవిధంగా హోంశాఖమంత్రి మహమూద్ అలీ అజాంపుర వార్డు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారా హిల్స్, హిమాయత్ నగర్, ఎల్‌బినగర్, లోగోజి గూడ, రామంతాపూర్, వివేక్‌నగర్ వార్డు కార్యాలయాలను ప్రారంభించనున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాం త కుమారి అమీర్‌పేట్ బికే గుడా వార్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. మిగితా వార్డు కార్యాలయాలను ఇదే స మయానికి జిహెచ్‌ఎంసి పరిధిలో మంత్రులు, మేయర్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు వార్డు కార్యాలయాలను లాంఛనంగా పారంభించనున్నారు.
వార్డు కార్యాలయాల విధులు
వార్డు పరిపాలన వ్యవస్థలో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా 150 వార్డు కార్యాలయాలు నేటి నుంచి అం దుబాటులోకి రానున్నాయి. ప్రతి వార్డు కార్యాలయాల్లో బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ , ఎంటమాలజి, జలమండలి, విద్యుత్, యుబిడి, యుసిడి, తదితర విభాగాల 10మందితో కూడిన అధికారుల బృందం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షణలో సేవలందించనున్నారు. వార్డు కార్యాలయాలు కేంద్రంగా ప్రజల నుండి అందిన ఫిర్యాదులను విభాగాల వారీగా సంబంధిత అధికారులు సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు అక్కడ పని చేయనున్నఅధికారులు, సిబ్బందికి ఉన్నతాధికారులు ప్రత్యేక శిక్షణను ఇ చ్చారు.
అదేవిధంగా వార్డు కార్యాలయం సిబ్బంది ప్రతి రోజు ఉదయం వేళాల్లో తమ పరిధిలోని వార్డు లో పర్యటించి వార్డులో నెలకొన్న సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించడం, ప్రజల నుంచి సైతం అక్కడే ఫిర్యాదులను స్వీకరించడం ద్వారా వాటిని పరిష్కారానికి కృషి చేయనున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు తప్పని సరిగా అన్ని విభాగాల అధికారులు వార్డు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు.
వార్డు కార్యాలయాల పని వేళల్లో ప్రజ లు తమ సమస్యలను నేరుగా విభాగాల వారిగా అధికారుల ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకు ప్రత్యేకంగా రిసెప్షనిస్ట్‌ను నియమించారు. ఈ ఫిర్యాదులను స్వీకరించడం వాటిని ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ చేసి సంబంధిత అధికారికి పంపించనున్నారు. ఈ సమస్య పరిష్కారం అయిన వెంటనే ఆ సమాచారాన్ని సంబంధిత దరఖాస్తుదారుడికి సమాచారాన్ని అందించనున్నారు. ప్రతి సమస్య పరిష్కారానికి ఖచ్చితమైన సమయాన్ని నిర్దేశిస్తూ సిటీజన్ చార్ట్ ను రూపొందించారు. ఈ వివరాలతో కూడిన ప్రత్యే బో ర్డులను ప్రతి కార్యాలయంలో ఏర్పాటు చేశారు.