Saturday, November 23, 2024

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి

యాచారం: రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికే పెద్దపీట వేస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం జేశారు.తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు,పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం యాచారం మండలంలో నూతనంగా ఏర్పడ్డ గ్రామపంచాయతీ తక్కళ్లపల్లితండాతో పాటు నందివనపర్తి గ్రామాలలో సుమారు రూ.3.46 కోట్ల విలువగల పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనతో పాటు కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు.

తక్కళ్లపల్లి తాండాలో రూ.20 లక్షల ఎస్టీ,ఎస్‌డిఎఫ్ నిధులతో నిర్మించనున్న నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి స్థానిక సర్పంచ్ రమావత్ జగదీశ్‌తో కలిసి ఆయన భూమిపూజ నిర్వహించారు.అలాగే నందివనపర్తి గ్రామంలో రూ.2.35 కోట్ల విలువగల ప్రధాన రహాదారి వెడల్పు పనులతో పాటు మరికొన్ని అంతర్గత సీసీ రోడ్లు సామాజిక భవనం,గ్రంథాలయం భవన నిర్మాణంపలు అభివృద్ధి పనులకు స్థానిక సర్పంచ్ కంబాలపల్లి ఉదయశ్రీ పలువురు ప్రజాప్రతి నిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపనతో పాటు మరికొన్నింటికి ఆయన ప్రాంభోత్సవం చేశారు.

పల్లెల ప్రగతికి పట్టుగొమ్మలని, అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.గతంలో గ్రామాలలో ప్రజలు తాగునీటికి అనేక ఇబ్బందులు పడేవారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం తీసుకువచ్చి అలాంటి సమస్య లేకుండా తీర్చిందని ఇంటింటికి నల్లాలు బిగించి ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరించిందన్నారు.అలాగే డంపింగ్‌యార్డులు, వైకుంఠధామాలు,పల్లెప్రకృతి వనాలు, క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి పారిశుద్ధ సమస్యను తీర్చడంతో పాటు పల్లెల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తుందని ఆయన వివరించారు.

కార్యక్రమంలో ఎంపిపి కొప్పు సుకన్యబాష, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, రైతుబంధు సమితి జిల్లా చైర్మన్ వంగేటి లకా్ష్మరెడ్డి, జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ సత్తు వెంకట రమణారెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్‌రెడ్డి, ఆర్డీవో వెంకటచారి, తహశీల్దార్ సుచరిత,ఎంపిడివో విజయలక్ష్మీ, సర్పంచ్‌లు బండిమీది కృష్ణ,కె.సంతోషరమేశ్, ఎంపిటిసిలు కె.సుమతమ్మ లోహిత్‌రెడ్డి, డేరంగుల శారదశంకర్,రైతుబంధు సమితి మండల కన్వీనర్ కొంగళ్ల జోగిరెడ్డి, ఉప సర్పంచ్ మూడెడ్ల గోవర్థన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ, బిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్నాటి రమేశ్ గౌడ్, బిఎన్‌ఆర్ ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు రాజూనాయక్ , ఓరుగంటి యాదయ్య గౌడ్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు సింగారం వెంకటయ్య, వార్డుమెంబర్ల ఫోరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోలం అనంతరెడ్డి, కాళ్ల జంగయ్య, కొండాపురం శ్రీశైలం, జెనిగ వెంకటేశ్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News