Saturday, December 21, 2024

మహాప్రస్థానంలో దశాబ్ది ఉత్సవాలు

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది వేడుకలలో భాగంగా జరుగు పట్టణ ప్రగతి దినోత్సవం సం బురాలు వినూత్నంగా జరపాలని అధికారులు నిర్ణయించారు. వి ద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మహాప్రస్థానం స్మశానవాటికలో ఈ వేడుకలు జ రుప తలపెట్టినారు.

చివరి మజిలీకి చిరునామా అయిన స్మశాన వాటికను ఆహ్లాదాన్ని అందించే ప్రదేశంగా నిర్మించిన విషయం విధితమే. పట్టణ ప్రగతిలో భాగంగా నిర్మించిన ఈ మహాప్రస్థానంలో పట్టణ ప్రగతి వేడుకలు నిర్వహించడం ద్వారా దీని ప్రాశస్తం ప్రజలకు తెలియజెప్పినట్లు అవుతుందని అధికారల యోచన. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పై తనదైన మార్క్ వేసుకున్న మంత్రి జగదీష్ రెడ్డి ఇలాఖాలో జరుగుతున్న మహాప్రస్థానంలో పట్టణ ప్రగతి వేడుకలు నిర్వహించడం సూర్యాపేట చరిత్రలో చిరస్థాయిగా నిలుచిపోతుంది. పైగా ఇదే మహాప్రస్థానంతో పాటు సూర్యాపేటలో ని ర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు రాష్త్ర స్థాయి అవార్డ్ ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ జరుగుతున్న పట్టణ ప్రగతి సంబరాలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కల్నల్ సంతోష్‌బాబు త్యాగం చిరస్మరణీయం
భానుపురి: దివంగత కల్నల్ సంతోష్‌బాబు త్యాగం చిరస్మరణీయమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం కల్నల్ సంతోష్‌బాబు మూడవ వర్ధంతి సందర్భంగా పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన సంతోష్‌బాబు వర్తమానానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు.

అనంతరం బాటసారులకు ఏర్పాటు చేసిన పులిహోర ప్యాకెట్లు, మజ్జిగను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ని మ్మల శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, జడ్పీటీసీ జీడి భిక్షం, బీఆర్‌ఎస్ నాయకులు ఉప్పల ఆనంద్, మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, బిఆర్‌ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూల బాలసైదులు గౌడ్, కౌన్సిలర్ తాహెర్ పాషా, చల్లా లక్ష్మీప్రసాద్, కక్కరేణి నాగ య్య, తోట శ్యామ్ ప్రసాద్, కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతో షి, తల్లిదండ్రులు బిక్కుమళ్ళ వెంకటేశ్వర్లు, మంజుల, కుటుంబ స భ్యులు తల్లాడ వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News