త్రిపురారం: సబ్బండవర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృ ధ్ది,సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని నాగార్జునసాగర్ ఎ మ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి కా ర్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమ నాయకుడు గా ఆనాడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు,తెలంగాణ వెనుకబాటును గు ర్తించి మనకు అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆయా వర్గాల అభివృద్ధితో పాటు బంగారు తెలంగాణే సాధనగా ప్రత్యేక కా ర్యాచరణతో ముందుకెళుతున్నారని అన్నారు. అందులో భాగంగానే గ్రామాల మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రజా భాగస్వామ్యంతో జవాబుదారితనంతో పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా నిధుల కేటాయింపు,పారదర్శకంగా పనులు చేపట్టడం ,పల్లె ప్రకృతివనాలు, హరితాహారం, స్మశాన వాటికలు, డం పింగ్‌యార్డ్‌లు, నాడెం కంపోస్టు షెడ్‌ల నిర్వహణ, మిషన్ భగీరథ, మిషన్ కా కతీయ పథకాల ద్వారా జరిగిన పలు అభివృధ్ది పనులను తెలియజేసేందుకు దశాబ్ది ఉత్సవాలన్నారు.అంతకు ముందు పల్లె ప్రగతి నివేదిక వివరాలను అ డిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామ పంచాయితీఈ కార్మికులను సన్మానించి ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఎమ్మెల్యేకు సన్మానం: పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ విచ్చేసిన సందర్భంగా ఆయనతో పాటు ట్రైకార్‌చైర్మన్ ఇస్లావత్ రాంచందర్ నాయక్,జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు , ఏ ఎంసి చైర్మన్ మర్ల చంద్రారెడ్డి తదితరులను స్థానిక సర్పంచ్ అనుముల శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలఅఓ పూలమాలలు,శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో ఆర్.అలివేలు మంగమ్మ, ఎంపివోమ దూపాటి భిక్షం రాజు, ఏపివో పూర నాయక్, నాయకులు రామచంద్రయ్య, జానయ్య, పామోజు వెంకటాచారి, మాధా ధనలక్ష్మి, కృష్ణ, జంగిలి శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రాచూరి వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ పిబి.శ్రీనివాస్, వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.
గ్రామ పంచాయితీలలో: దశాబ్ది ఉత్సవాల సందర్బంగా మండలంలోని పలు గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించి ,పల్లె ప్రకృతి వనాలను సందర్శించి వన సంరక్షణ, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్యంలపై ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను అవనతం చేశారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్మికులను సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్తి పద్మ శ్రీనివాస్, గుడ్లపల్లి సునీత శ్రీనివాస్, నామ రాజు, సుశీల్ నాయక్, గజ్జెల కోటిరెడ్డి, దాసరి అ డవయ్య, చెవుల రామయ్య యాదవ్, మద్దూరి శ్రీనివాస్,అవిరెండ్ల వీరయ్య, ముడిమాళ్ల కొండమ్మ, పంచాయతీ కార్యదర్శులు, కోడిరెక్క రాజేంద్రకుమార్, షేక్ జాఫర్, సతీష్‌రెడ్డి, పట్టెం భిక్షపతి, ఆవుల మమత, అరుణ, రాధిక, అనూ ష, అవినాష్, తదితరులు ఉన్నారు
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
- Advertisement -
- Advertisement -
- Advertisement -