Monday, December 23, 2024

టిఎస్ లాసెట్, పిజి ఎల్‌సెట్‌లో 80.21 శాతం ఉత్తీర్ణత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన టిఎస్ లాసెట్, పిజిఎల్ సెట్ లో 80.21 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురువారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొపెసర్ ఆర్. లింబాద్రి టిఎస్ లాసెట్, పిజి ఎల్‌సెట్- 2023 ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి.రవీందర్, లాసెట్ కన్వీనర్ బి. విజయలక్ష్మి, ప్రొఫెసర్ జి.బి.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మూడేళ్ల ఎల్‌ఎల్‌బీలో 78.59 శాతం, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీలో 80.21 శాత్తం ఉత్తీర్ణత నమోదుకాగా, పిజి ఎల్‌సెట్(ఎల్‌ఎల్‌ఎం)లో 94.36 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు వెల్లడించారు. ఎల్‌ఎల్ బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సులలో మొత్తం 7,560 సీట్లు అందుబాటులో ఉండగా, గత విద్యాసంవత్సరం 6,230 సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. ఈ సందర్భంగా లాసెట్, పీజీఎల్ సెట్ లో ఉత్తమ ర్యాంకులు సాధించిన అభ్యర్థుల జాబితా ప్రకటించారు.
లాసెట్ ఫలితాల్లో టాపర్లు
మూడేళ్ల ఎల్.ఎల్.బిలో ఏపీ పశ్చిమగోదావరికి చెందిన శ్రీరామ్ బొడ్డు మొదటి ర్యాంకు సాధించగా, ఖమ్మం జిల్లాకు చెందిన కల్లూరి నరేష్ రెండో ర్యాంకు, మంచిర్యాలకు చెందిన బి.శ్రవణ్ కుమార్ మూడో ర్యాంకు సాధించారు. ఐదేళ్ల ఎల్.ఎల్.బి లో ఉత్తరప్రదేశ్ కు చెందిన మహమ్మద్ మహబూబ్ మొదటి ర్యాంక్ సాధించగా, బాచుపల్లి కి చెందిన అదితి గైదానే రెండో ర్యాంకు, మంచిర్యాల జిల్లాకు చెందిన తన్నీరు హరిప్రసాద్ మూడో ర్యాంకు సాధించారు. అలాగే ఎల్‌ఎల్‌ఎంలో ఏపీ విజయవాడ రూరల్ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన తుపిలి రవీంద్రబాబు మొదటి ర్యాంక్, పశ్చిమగోదావరి కి చెందిన బొడ్డి కూరపాటి సాయి నాగ సిరి రెండో ర్యాంకు, నంద్యాలకు చెందిన షేక్ అనీషా రేషమ్ మూడు ర్యాంకు పొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News