Friday, December 20, 2024

గ్రామ శివారులో కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని మృతదేహం…

- Advertisement -
- Advertisement -

 

రాంఛీ: కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూల్‌లో పదకొండో తరగతి చదువుతున్న బాలిక మృతదేహం గ్రామ శివారులో కనిపించిన సంఘటన ఝార్ఖండ్ రాష్ట్రం ఛత్రా జిల్లా లవలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వేసవి సెలవులు ఉండడంతో పదకొండో తరగతి చదువుతున్న బాలిక తన సొంత గ్రామానికి వచ్చింది. బుధవారం మధ్యాహ్నం వివిధ రకాల పండ్ల కోసం గ్రామ శివారులోకి వెళ్లిపోయింది.

సాయంత్రం ఇంటికి రాకపోయేసరికి ఆమె కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. ఎక్కడ కనిపించకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. గురువారం రోజు గ్రామ శివారులో ఆమె దుస్తులతో పాటు మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకొని శవ పరీక్ష నిమిత్తం చత్రా సదార్ ఆస్పత్రికి తరలించారు. తన కూతురుపై అత్యాచారం చేసిన హత్య చేసి ఉంటారని ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టమ్ నివేదిక వచ్చిన తరువాత నిజాలు బయటకు వస్తాయని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News