Thursday, December 19, 2024

మరిదితో కలిసి భర్తను చంపిన భార్య

- Advertisement -
- Advertisement -

 

లక్నో: భర్తను భార్య తన మరిదితో కలిసి చంపి అనంతరం సెప్టిక్ ట్యాంక్‌లో మృతదేహాన్ని పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్ ప్రాంతంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. సాగర్-అశియా అనే దంపతులు ముజఫర్ నగర్‌లో నివసిస్తున్నారు. సాగర్ సోదరుడు సుహేల్‌తో అశియా అక్రమ సంబంధం పెట్టుకుంది. దీంతో వివాహేతర సంబంధానికి అడ్డుగా సాగర్ ఉండడంతో హత్య చేయాలని మరదితో వదిన ప్లాన్ వేసింది. ప్లాన్‌లో భాగంగా భర్తను భార్య తన మరిదితో కలిసి గొంతు నులిమి హత్య చేసింది.

Also Read: ప్రేమపెళ్లి… నాగర్‌కర్నూల్‌లో గర్భిణీ ఆత్మహత్య

అనంతరం మృతదేహాన్ని సెప్టింక్ ట్యాంక్‌లో పడేసింది. సాగర్ కనిపించడం లేదని జూన్6న స్థానిక పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా భార్యపై అనుమానాలు రావడంతో ఆమెను అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించారు. తన మరిదితో కలిసి హత్య చేశానని ఒప్పుకుంది. జూన్ 9న మృతదేహాన్ని సెపిక్ ట్యాంక్ నుంచి బయటకు తీసి శవ పరీక్ష నిమిత్తం ముజఫర్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వెంటనే వదిన, మరిదిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News