- Advertisement -
తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. లావణ్య ఫొటో ఫ్రేమ్ వర్క్స్ దుకాణంలో మంటలు అంటుకున్నాయి. మంటలు చూసి పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గోవిందరాజస్వామి గుడి రథ మండపం వద్దకు మంటలు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన దుకాణం రద్దీ ప్రాంతంలో, ఇళ్లు మధ్య ఉన్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటానాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -