Friday, December 20, 2024

ఎంబిబిఎస్ విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లక్నో: ప్రేమలో విఫలం కావడంతో ఎంబిబిఎస్ విద్యార్థిని  ఉరేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మోడీనగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దివ్య అనే యువతి ఎంబిబిఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉండి కాలేజీకి వెళ్తోంది. హాస్టల్ రూమ్‌లో దివ్యకు ఆమె స్నేహితులు పలుమార్లు పోన్ చేసిన స్పందించకపోవడంతో రూమ్ డోర్ తట్టిన కూడా స్పందించలేదు. హాస్టల్ యజమాని మనోజ్ కుమార్ సహాయంతో డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి చూడగా ఆమె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సూసైడ్ నోట్ కనిపించింది. తన ప్రియుడితో ప్రేమలో విఫలం కావడంతోనే ఆత్మహత్య చేసుకున్నానని వివరించింది.

Also Read: గుజరాత్‌లో బిపర్‌జాయ్ బీభత్సం…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News