Monday, November 25, 2024

నీట్ లో ర్యాంకు కొట్టిన కశ్మీరు కవల సోదరీమణులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని కుల్గాం జిల్లాకు చెందిన ఒక ఇమాం ఇద్దరు కవల కుమార్తెలు అండర్ గ్రాడ్యుయేట్ నేషనల్ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్ టెస్ట్(నీట్-యుజి)లో ఉత్తీర్ణులయ్యారు. మంగళవారం నీట్ యుజి ఫలితాలు వెలువడ్డాయి. మొదటి ప్రయత్నంలోనే ఆ ఇద్దరు కవల బాలికలు నీట్ యుజిలో ఉత్తీర్ణులు కావడం విశేషం.

కుల్గాం జిల్లాలోని నూరాబాద్ ప్రాంతంలోని వటూ గ్రామానికి చెందిన సయ్యద్ సబియా, సయ్యద్ బిస్మా నీట్‌లో వరుసగా 625, 570 మార్కులు సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే ఆ ఇంట సంబరాలు మిన్నంటాయి. ఆ కవల సోదరీమణులు సాధించిన విజయాన్ని అభినందించడానికి పెద్దసంఖ్యలో బంధువులు, స్నేహమితులు, శ్రేయోభిలాషులు వారింటికి చేరుకున్నారు.

తమ విజయం వెనుక తమ కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, ప్రోత్సహించిన శ్రేయోభిలాషులు ఉన్నారని ఆ బాలికలు తెలిపారు. స్థానిక జామియా మసీదులో ఇమాంగా పనిచేస్తున్న సాజద్ హుస్సేన్ తన కుమార్తెలు సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News