Tuesday, November 26, 2024

భగ్గుమన్న భువనగిరి

- Advertisement -
- Advertisement -

యాదాద్రిభువనగిరి:అధికార పార్టీకి చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాసంలో గత మూడు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతుండటంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు భగ్గుమన్నారు. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఇంట్లో , ఆఫీస్‌లో ఐటీ సోదాలు కొనసాగుతుండటంతో రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్న భువనగిరి ఎమ్మెల్యే శేఖర్ రెడ్డిని అణగదొక్కేందుకే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, రాజకీయ కక్షతో అణిచివేయాలని చూస్తోందని, భువనగిరి నియోజకవర్గ బిఆర్‌ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎమ్మెల్యే శేఖర్‌రెడ్డి ఇల్లు, ఆఫీస్‌లపై చేయిస్తున్న ఐటీ దాడులను నిలిపివేయాలని, బిజెపి డౌన్ డౌన్, మోడీ డౌన్ డౌన్, ఎమ్మెల్యే జోలికొస్తే ఊరుకోబోమని హెచ్చనించారు. బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రిన్స్ చౌరస్తా వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో బిఆర్‌ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి ఐటీ దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కక్షతోనే ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిపై కేంద్రం ఐటీ దాడులు నిర్వహిస్తుందని రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అమరేందర్‌గౌడ్, రైతు సమితి అధ్యక్షుడు అమరేందర్, మార్కెట్ చైర్మన్ రాజేందర్ రెడ్డి, భువనగిరి మండల, పట్టణ అధ్యక్షుడు జనగాం పాండు, ఏవీ కిరణ్ కుమార్, నీలం ఓంప్రకాష్, ఎంపిపి నరాల నిర్మలవెంకటస్వామి, జడ్పీటీసీ సుబ్బూరు బీరుమల్లయ్య, కంచి మల్లయ్య, సింగిల్ విండో చైర్మన్ పరమేశ్వర్, వైస్ చైర్మన్ మహేందర్ నాయక్, నాయకులు కవిత, రాఘవేందర్ రెడ్డి, బి.మధుసూదన్ రెడ్డి, ఆర్.శ్రీనివాస్, సురేష్, వీరేశం, శ్రీనివాస్, సుభాష్, పాండు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News