Monday, December 23, 2024

పరిశుభ్ర పరిసరాలతో పనితీరు మెరుగుదల

- Advertisement -
- Advertisement -
స్వచ్ఛత పక్షోత్సవాలలో సింగరేణి జిఎం కోఆర్డినేషన్ సురేష్

హైదరాబాద్ : మన చుట్టూ పరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లయితే ఆరోగ్యకరమైన ఆలోచనలు, పనితీరులో మెరుగుదల కనిపిస్తుందని , కనుక ప్రతి ఒక్కరు తమ గృహ పరిసరాలను, కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సింగరేణి జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్) ఎం.సురేష్ పిలుపునిచ్చారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాల పై సింగరేణి వ్యాప్తంగా 15 రోజులపాటు నిర్వహించే స్వచ్ఛతా పఖ్వాడా (స్వచ్ఛత పక్షోత్సవాలు) కార్యక్రమాన్ని ఆయన హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు.

పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు వ్యాధులు ప్రబలుతాయని, అప్పుడు వైద్యం కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందని అయితే ముందుగానే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రారంభిస్తే వ్యాధుల బారిన పడకుండా ఉండి, ఖర్చులు తగ్గించుకోగలుగుతామన్నారు. ప్రతి వ్యక్తి కనీసం వారానికి రెండు గంటలు తన గృహ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని, అది అతని కుటుంబానికి, అక్కడ నివసించే ఇతరులకు ఎంతో మేలు చేస్తుందన్నారు.

సింగరేణి సంస్థ ఏటా స్వచ్ఛత పఖ్వాడా నేపథ్యంలో అన్ని ఏరియాల్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతుందని, గనులు, కార్యాలయాలను, పరిసరాలను శుభ్రపరచడం, కాలనీలు, వీధులను శుభ్రపరచడం, మొక్కలు నాటడం వంటి పనులను చేపడుతోందన్నారు. ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ కోసం ,తమ కుటుంబ ఆరోగ్యం కోసం చేపడుతున్న కార్యక్రమంగా భావించి స్వచ్ఛందంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సామూహికంగా స్వచ్ఛతా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో అన్ని విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News