Saturday, November 16, 2024

రంగవల్లులు తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక

- Advertisement -
- Advertisement -

కల్వకుర్తి రూరల్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలలో మున్సిపల్ పరిధిలోని పలు వార్డులకు చెందిన మహిళలు, యువతులు, చిన్నారులు ఆహ్లాదకరంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షహీద్, కల్వకుర్తి సిఐ, పిఎసిఎస్ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ గౌడ్, వైస్ ఎంపిపి గోవర్ధన్ గుప్తా తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ రంగవల్లులు తెలంగాణ సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. అనంతరం ముగ్గుల పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు సూర్యప్రకాష్ రావు, సైదులు గౌడ్, నూనె యాదమ్మ, శ్రీనివాస్, బావండ్ల మధు, నాయకులు బన్నె శ్రీనివాస్ యాదవ్, శ్రీధర్ యాదవ్, రాం పర్వతాలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జమ్ముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News