Sunday, November 24, 2024

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పట్టణాలలో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

గద్వాల : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పట్టణాలలో అభివృద్ధి జరిగిందని, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ము న్సిపాల్టీలలో మౌలిక సదుపాయాలు కల్పించి పట్టణ అభివృద్ధ్దికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శుక్రవారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమం స్థానిక మున్సిపాల్టీ కార్యాలయ ఆవరణలో జెండా ఎగురవేసి ర్యాలీగా మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్యారడైజ్ ఫంక్షన్ హాల్‌కు చేరుకున్నారు. ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బి.ఎస్. కేశవ్ , అదనపు కలెక్టర్ అపూర్వ చౌహన్‌లతో కలిసి జ్యోతిని వెలిగి ంచి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రగతి అనే కార్యక్రమం చేపట్టి ప్రత్యేకంగా నిధులు కేటాయించి పట్టణ అభివృద్ధ్దికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. గద్వాలలో 30 పార్కులు ఓపెన్ జీమ్‌లు, క్రీడా ప్రాంగణాలు , పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారానే ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధుల కింద రూ. 30 కోట్లు అంది ంచడం జరిగిందని, మార్కెట్లో వివిధ రకాల అభివృద్ధి పనులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ రూ. 26 కోట్లు పట్టనా అభివృద్ధి కోసం ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఇటీవలే ముఖ్యమంత్రి గద్వాల మున్సిపాల్టీకి రూ. 50 కోట్లు నిధులు మంజూరు చేయడ ం జరిగిందని తెలిపారు. ఈ నిధుల ద్వారా ప్రజల కు అవసరమయ్యే అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ప్రజలు మున్సిపాల్టీకి సహకరించాలని కలెక్టర్ తెలిపారు. గద్వాల మున్సిపాల్టీ అభివృద్ధికి చైర్మన్, కౌన్సిలర్లు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. మున్సిపల్ సిబ్బంది సేవలు మరువలేనివని సఫాయి అన్న సలాం అన్న సిఎం మాటను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ సమయంలో సపాయి కార్మికులు మేము ఉన్నామని ముందుకొచ్చి ,సేవలు అందించారని, గతంలో నీటి సమస్య ఉండేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికి నీళ్లు, పట్టణంలో 60 శాతం సిసి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి గద్వాల మున్సిపాల్టీ పట్టణం దినదినాభివృద్ధి చెందిందని, అభివృద్ధిలో అధికారులు ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు కృషి చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ మాట్లాడుతూ గతంలో చెత్త ఎక్కడ పడితే అక్కడ వేసేవారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటింటికీ ఆటో ఏర్పాటు చేసి చెత్త తీస్తున్నామని, మున్సిపాల్టీపై ప్ర త్యేక దృష్టి సారించి గద్వాల మున్సిపాల్టీ రూ. 100 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మెప్మా ద్వారా 44 మహిళా సంఘాలకు 3. 53 కోట్ల రుణాల చెక్‌ను అందజేశారు. మున్సిపాల్టీ సఫాయి సిబ్బందికి సన్మానం చేశారు. ఉత్తమ కౌన్సిలర్ , ఉత్తమ మహిళలకు, బ్యాంకు నిర్వాహకులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ జంబూ రామన్‌గౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీధర్‌గౌడ్, వైస్ చైర్మన్ బాబర్ , రైతు సమన్వయ అధ్యక్షుడు, మున్సిపల్ కమిషనర్ నర్సిములు, సిబ్బంది, కౌన్సిలర్లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News