Monday, December 23, 2024

విద్యుదాఘాతంతో పూరిళ్లు దగ్ధం

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట : విద్యుదాఘాతంతో పూరిళ్లు దగ్ధమైన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని మల్లాయిగూడెం పంచాయతీ నాగులగుంపు గ్రామానికి చెందిన కుంజా జోగారావు గృహంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమయ్యేపాటికి పూరిళ్లు కావడంతో అగ్నికి ఆహుతైంది. దీంతో పలు గృహోపకరణాలు పూర్తిగా కాలిపోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఈ ప్రమాదంలో 12 బస్తాల ధాన్యం, రూ.లక్ష నగదు, ఇతర సామగ్రి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోయాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News