Saturday, November 23, 2024

మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజ

- Advertisement -
- Advertisement -

వనపర్తి :వనపర్తి పట్టణ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ముందంజలో ఉన్నామని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మెన్ లోక్‌నాథ్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవా ల్లో భాగంగా శుక్రవారం పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమాన్ని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్‌తో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కార్యలయం నుంచి మున్సిపల్ సిబ్బంది, అధికారులు, ప్రజలతో గా ంధీ చౌక్ వరకు భోనాలు, బతుకమ్మలు, బ్యాండ్ బాజాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జెడ్పి చైర్మెన్ మాట్లాడుతూ వనపర్తి పట్టణ గతంతో పోల్చుకుంటే నేడు ఎన్నో అభివృద్ధి పనులు జరిగే ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవడం జరిగిందన్నారు.

వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండటానికి కారణం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలతో పాటు సఫాయి కార్మికులు, మున్సిపల్ సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు. అందుకే నేడు కమాటి, స్వీపర్‌లకు పాదాలు కడిగి పాదపూజ చేసి సన్మానించుకోవడం జరిగిందన్నారు. పారిశుద్ధ కార్మికుల పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం అం దించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు, పిల్లలకు ఉన్నత విద్యలు చదివించాలని, అందుకు ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ధడం జరిగిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణ అభివృద్ధితో పాటు ఇక్కడి పేద ప్రజలకు ఉపాధి కల్పించడం చాలా అ వసరమని అందుకు మంత్రి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి జిల్లాకు పరిశ్రమలు తీసుకువచ్చేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, ఇప్పు డు ఉన్న పరిస్థితులకు చాలా తేడాలు ఉన్నాయన్నా రు. టౌన్ ప్లానింగ్ మున్సిపల్ సిబ్బంది మనస్ఫూర్తిగా పనిచేస్తూ వనపర్తి పట్టణాన్ని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్ధడంలో ముఖ్యభూమిక పోషించారన్నారు.

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముందు చూపుతో ఆలోచించి వనపర్తి పట్టణానికి అవసరమైన మౌలిక సదుపాయాలు సమకూర్చడంతో పాటు అవసరమైన నిధు లు తీసుకొచ్చారని అందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ చట్టం 1965ను ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మార్పు చేర్పులు చేసి 2019 కొత్త చట్టం తీసుకురావడం జరిగిందన్నారు. కొత్త చట్టం వచ్చాక ప్రజలకు రో జువారి అవసరాలకు ఎలాంటి మౌలిక అవసరాలు ఉంటాయో వాటిని పరిష్కరించే దిశగా కృషి చేశారన్నారు. ప్రజలకు అవసరమైన తాగునీరు, విద్యు త్, పారిశుద్ధం, మరుగుదొడ్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

నిత్యావసర వస్తువులు, కూరగాయలు ఒకే చోట సమీకృత మార్కెట్‌లో నాణ్యమైన వి దొరికే విధంగా సమీకృత మార్కెట్లు ఏర్పాటు చే యడం జరిగిందన్నారు. దీని వల్ల ప్రజలకు సమ యం ఆదా అయి సకాలంలో ఇతర పనులపై దృష్టి సారించేందుకు వీలు దొరుకుతుందన్నారు. పట్టణంలో తాగునీటి సమస్యను పూర్తిగా పరిష్కరించి రోజువారిగా సిద్ధమైన నీరు అందించేందుకు బోగపల్లి తాండ వద్ద కొత్తగా డబ్లూటిపి ఏర్పాటు చేయ డం జరుగుతుందని, రాబోయే 15 రోజుల్లో పను లు పూర్తి చేసి ప్రజలకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

వనపర్తి పట్టణానికి నలువైపులా ఉన్న రోడ్లను విస్తరించుకోవడానికి సహకరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మెన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్ వనపర్తి పట్టణంలో ప్రస్తుతం సాధించిన అభివృద్ధి, గత ప్రభుత్వంలో ఉన్న తేడాపై స్పష్టత ఇచ్చారు. అంతకు ముందు మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి వనపర్తి పట్టణ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.

అనంతరం మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మెన్ వాకిటి శ్రీధర్ సఫాయన్న సలామన్న అని మల్లయ్య, కామాటి, చంద్రమ్మ స్వీపర్‌లకు పాద పూజ చేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ పద్మావతి, తహసీల్దార్ రాజేందర్ గౌడ్, కౌ న్సిలర్ నందిమల్ల, భువనేశ్వరి, కౌన్సిలర్లు, సింగిల్ విండో అధ్యక్షుడు మాధవ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు, సిబ్బంది, సఫాయి కార్మికులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News