కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126డివిజన్ పరిధిలోని జగద్గిరిగుట్ట మోడల్ మార్కెట్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భా గంగా తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ వేడుకల్లో నూతనంగా ఏర్పా టు చేసిన వార్డు కార్యాలయాన్ని శుక్రవారం మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథులుగా పాల్గొని కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మమత, స్థానిక కార్పొరేటర్ కొలుకుల జగన్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం, ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేయాలనే మంచి ఆలోచనతో వార్డు కా ర్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని అన్నారు.
పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సారధ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 150 వార్డు కార్యాలయాలు నేడు ప్రజలకు అందుబాటులో కి వచ్చాయన్నారు. ఈ వార్డు కార్యాలయాల్లో వార్డుకు 10 మంది చొప్పున 150 వార్డుల్లో 1500 మంది అధికారులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపనున్నారని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ కు కృషి చేసిన సీఎం కేసీఆర్‌కి, మంత్రి కెటిఆర్‌కు కృతజ్ఞతలు తె లిపారు. గత పాలకుల హయాంలో అభివృద్ధికి నోచుకోని జగద్గిరిగుట్టను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. అర్హులైన పేదలకు పట్టాలు అందించామన్నారు. రాబోయే రోజుల్లో జగద్గిరిగుట్టలో అందుబాటులో ఉన్న స్థలంలో మెడికల్ కాలేజీ, బస్ టర్మినల్, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిసి ప్రశాంతి మరియు అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.