కరీంనగర్: ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా కరీంనగర్ పట్టణంలో ఇస్కాన్ మెట్‌పల్లి , ప్రజ్ఞాభారతి కరీంనగర్ సంయుక్త ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న జగన్నాథ రథయాత్ర కార్యక్రమాన్ని ఈ నెల 28న అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నామని ఈ కార్యక్రమానికి కరీంనగర్ ప్రజలంతా తరలిరావాలని అన్నారు.
శుక్రవారం కరీంనగర్‌లో జగన్నాథ రథయాత్ర సంబంధించిన పోస్టర్ను మంత్రి గంగుల కమలాకర్ ఆవిష్కరించి పిలుపునిచ్చారు. మాట్లాడుతూ ఏటా పూరిలో నిర్వహించే జగన్నాథుని రథయాత్ర మన కరీంనగర్ పట్టణంలో నిర్వహించుకోవడం ఎంతో ఆనంద దాయమని ఇది కరీంనగర్ పట్టణానికి గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ రథయాత్రలో జగన్నాథుని భక్తులు, కరీంనగర్ ప్రజలు వేలాది తరలి వచ్చి ఆ స్వామి కృపకు పాత్రులు కావాలని , జగన్నాథుని రథాన్ని లాగడం అంటే స్వామిని గుం డెల్లోకి లాక్కోవడం అని కాబట్టి ఇంతటి మహా మహోత్సవంలో పాల్గొని ఆ భగవంతుని సేవలో తరించాలని పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే సాంస్కృతిక కళాకారుల సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ మాట్లాడుతూ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా శోభాయమానం గా జరుపుకొనుటకు ప్రజలు తరలిరావాలని కోరారు. సిఎ.డి. నిరంజనాచారి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ నగరాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుటకు ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు. రథయాత్ర చైర్మన్ కన్నె కృష్ణ మాట్లాడుతూ ఈ రథయాత్ర రామ్ నగర్ లోని సత్యనారాయణ స్వామి ఆలయం నుండి ప్రారంభమై గీతా భవన్ చౌరస్తా మీదుగా బస్టాండ్, కమాన్, బోయవాడ నుండి క్లాక్ టవర్ మీదుగా రాజీవ్ చౌక్ నుండి వైశ్య భవన్ వరకు కొనసాగుతుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు ,వేషధారణలతో ఈ శోభాయాత్ర కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. కావున భక్తులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి చైర్మన్ డాక్టర్ ఎల్. రాజభాస్కర్ రెడ్డి , కో కన్వీనర్ తుమ్మల రమేష్ రెడ్డి పాల్గొన్నారు.