Monday, December 23, 2024

పట్టణ ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: పట్టణాల ప్రగతికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దశాబ్ధి వేడుకల్లో భాగంగా పట్టణ ప్రగతి ఉత్సవాలను పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అమర్ నగర్, పెద్ద మజీద్, జెండా చౌరస్తా, కమాన్ చౌరస్తా మీదుగా కూనారం రోడ్డులోని నందన గార్డెన్ వరకు ఒగ్గు డోలు కళాకారులు, బోనాలు, డప్పు చప్పుళ్లతో సఫాయి అన్న సలాం.. సఫాయి అమ్మ సలాం అనే నినాదంతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి,మున్సిపల్ చైర్మెన్ దాసరి మమత పా ల్గొన్నారు. కళాకారులతో కలిసి డలు వాయిస్తూ ముందుకు సాగారు. అనంతరం నందన గార్డెన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు మాట్లాడారు.

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున సంక్షేమ పథకాలు, పట్టణంలోని అ భివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. పెద్దపల్లిలో జరుగుతున్న అభివృద్ధిపై వివరించారు. పట్టణ ప్రజల సహకారంతో స్వచ్చత పట్టణంగా పెద్దపల్లిని తీర్చిదిద్దామని అన్నారు. ఇంటింటికి పండ్లు, నీడనిచ్చే చెట్లను హరితహారంలో భాగంగా అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

మహిళల సాధికారత కోసం అనేక సంక్షేమ అభివృద్ది పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మెన్‌లు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ శివ ప్రసాద్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ జడల సురేందర్, వార్డు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News