హైదరాబాద్ : తెలంగాణ వర్సిటీ విసి రవీందర్‌పై త్వరలో వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైస్ ఛాన్సెలర్ అక్రమాలకు పాల్పడినట్లుగా ప్రభుత్వానికి నివేదిక అందినట్లుగా సమాచారం. ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినట్లుగా ఆధారాలు సైతం అందినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విసిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇదిలావుండగా బుధవారం తెలంగాణ వర్సిటీలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్ధి సంఘాలు ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే. వేతనాలు కోరుతూ సిబ్బంది, ఆహారం లేక తాము పస్తులుండాల్సి వస్తోందని విద్యార్ధులు నిరసనకు దిగారు. సమస్యలను పరిష్కరించకుంటే రాజీనామా చేయాలని వారు విసిని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కొందరు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్‌లోని పూలకుండీలను ధ్వంసం చేశారు. దీనికి తోడు విసిపై అనేక ఆరోపణలు రావడంతో ప్రభుత్వం విచారణ చేయించినట్లుగా తెలుస్తోంది.