నాగర్‌కర్నూల్ : నూతన కలెక్టరేట్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ అన్నారు. సమీకృత కలెక్టరేట్‌లో శానిటేషన్, భద్రత, ఎలక్ట్రిసిటీ తదితర అంశాలపై అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ పరిసరాలు ఎల్లప్పుడు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యాలయ భద్రత కోసం అవసరమైన 70 సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యాలయ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకునేందుకు అ న్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. చెత్తాచెదారం పరిసర ప్రాంతాల్లో వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కిటికిలో ఆహార పదార్థాలను, చెత్తను బయటికి వేస్తే సంబ ంధిత శాఖ అధికారులచే క్లీన్ చేయిస్తానని హెచ్చరించారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలన్నారు. విద్యుత్, ఇంటర్నెట్ తదితర సౌకర్యాలపై అధికారుల తో సమీక్ష నిర్వహించారు. శాఖల వారిగా నాలుగో తరగతి ఉద్యోగస్తుల వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మోతిలాల్, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసులు, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.