Monday, December 23, 2024

వివేకా హత్య కేసు ఆరుగురు నిందితులకు రిమాండ్ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివేకా హత్య కేసుపై శుక్రవారం సిబిఐ కోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసులో ఆరుగురు నిందితులను కోర్టులో సిబిఐ హాజరుపర్చింది. ఈ ఆరుగురు నిందితుల్లో ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. అయితే విచారణ సందర్భంగా ఆరుగురు నిందితుల రిమాండ్‌ను ఈ నెల 30 వరకు పొడిగించింది. తదుపరి విచారణను కూడా ఈ నెల 30కు వాయిదా వేసింది.

దీంతో నిందితులను అధికారులు తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో అవినాష్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే సిబిఐ అధికారులు పలుమార్లు అవినాష్ రెడ్డిని ప్రశ్నించారు. అయితే అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే కోర్టు విధించిన షరతుల మేరకు అవినాష్ రెడ్డి శనివారం రోజున సిబిఐ విచారణకు హాజరవుతూ వస్తున్నారు. అయితే తాజాగా సిబిఐ ఈ కేసులో అవినాష్‌రెడ్డిని ఎ-8గా పేర్కొంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News