Saturday, November 23, 2024

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే తెలంగాణ అభివృద్ది

- Advertisement -
- Advertisement -
ఈనెల 22న “ఇంటింటికీ బీజేపీ” పేరుతో జనంలోకి
జూబ్లిహిల్స్ మోర్చా సమావేశంలో బండి సంజయ్ కుమార్

హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ తనకు మంచి మిత్రుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒక్కటేననే భావన కలిగించాలని, తద్వారా తెలంగాణలో పెరుగుతున్న బీజేపీ గ్రాఫ్ ను దెబ్బతీయాలన్నదే కేసీఆర్ కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు. శుక్రవారం జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ సంయుక్త మోర్చాల సమావేశానికి బండి సంజయ్ తోపాటు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లంకల దీపక్ రెడ్డి సహా వివిధ మోర్చాలకు చెందిన నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మోదీ 9 ఏళ్ల పాలనను పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ అభివృద్ది , సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహజన్ సంపర్క్ అభియాన్‌” కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గత 16 రోజులుగా తెలంగాణలో ఈ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. నిన్న నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జేపీ నడ్డా “శభాష్‌” అంటూ అభినందించినట్లు చెప్పారు.

ఈనెల 22న ఉదయం 7 నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి కార్యకర్త పోలింగ్ బూత్ వారీగా “ఇంటింటికీ బీజేపీ” పేరుతో ప్రచారం నిర్వహించాలని సూచించారు. ముస్లిం మహిళలపై జరుగుతున్న వేధింపులు, కుటుంబ నియంత్రణ లేకుండా చేయడంవంటి పరిణామాలవల్ల వాళ్లు పడుతున్న బాధలను చూసిన మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాఖ్ ను రద్దు చేసిందన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ తో భారత దేశ సత్తా చాటామని ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలన్నీ కల్పిస్తున్న ఘనత మోదీదే. మోదీ పాలనలో ప్రశాంతంగా దేశం ఉంటే కాంగ్రెస్ తట్టుకోలేక మోదీపై అక్కసు వెళ్లగక్కుతున్నారు.

అనంతరం ప్రకాశ్ జవదేకర్ ప్రసంగిస్తూ ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు బండి సంజయ్ ఎక్కడికి వెళ్లినా విపరీతమైన స్పందన రావడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ పెరిగిందన్నారు. కేంద్ర చేపట్టిన పథకాలను ఒక్కో మోర్చా కార్యకర్త ప్రతిరోజు మూడు ఇళ్లకు వెళ్లి ప్రచారం చేయాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News