- Advertisement -
మహబూబ్‌నగర్: ఉప్పునుతల మండల పరిధిలోని రాయిచేడులో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. రాయిచేడులో ఇంటిముందు మంచంపై కూర్చున్న మహిళలను ఓ కారు అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు అమృత (33), అనిత (22) అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ హుస్సేనమ్మతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -