Wednesday, January 8, 2025

అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు

- Advertisement -
- Advertisement -

మల్కాజిగిరి: తన ఐదేళ్ల పదవి కాలంలో ఇప్పటి వ రకు రూ. 2 వేల కోట్ల అంచనా వ్యయంతో మల్కాజిగిరి నియోజకవర్గంలోని మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహాకారంతో మల్కాజిగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని ఆయన చెప్పారు. తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా ఆనంద్‌బాగ్‌లోని బృంధావన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్‌లో సర్కిల్ ఉప కమిషనర్ జి.రాజు అధ్యక్షతన చేపట్టిన పట్టణ ప్రగతి దినోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..మౌలిక వసతుల కల్పన కోసం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ సహకారం అందించి అభివృద్ధికి దోహదపడాలన్నారు.

అభివృద్ధి, సంక్షేమం తెలంగాణ ప్రభుత్వానికి రెండు కళ్లు అన్నారు. ధీర్ఘకాలికంగా నెలకొన్న మౌలాలి కమాన్ రోడ్డు విస్తరణ సమస్యను ప రిష్కరించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకే దక్కుతుందని స్పష్టం చేశారు. ఆనంద్‌బాగ్ ఆర్‌యుబి నిర్మాణ పనులు పూర్తి చేశామన్నారు. అనేక కాలనీలలో వరద నీటి ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి బాక్స్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టామన్నారు. ఇప్పటి వరకు మల్కాజిగిరి నియోజకవర్గంలో రూ 46 కోట్లు వ్యయంతో కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలను లబ్ధిదారులకు అందచేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రభుత్వ స్ధలాలలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి జీఓ 58, 59 కింద ప్రొసిడింగ్ కాపీలను అందచేసినట్లు చెప్పారు. వాజ్‌పేయ్‌నగర్ ఆర్‌ఓబీ సమస్య పరిష్కరిస్తామని చెప్పారు.

మల్కాజిగిరి సర్కిల్‌లో 17 పొదుపు మహిళా గ్రూపు సభ్యులకు రూ 1 కోటి 69 లక్షలు , అల్వాల్ సర్కిల్‌లోని పొదుపు మహిళా గ్రూపు సభ్యులకు రూ 80 లక్షలు చెక్కును అందచేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్ల కార్పొరేటర్లు ప్రేమ్‌కుమార్, మేకల సునిత రాముయాదవ్, సబితా కిషోర్, జితేంద్రనాథ్, క్యానం రాజ్యలక్ష్మీ,మాజీ కార్పొరేటర్ ఎన్. జగధీష్‌గౌడ్, మల్కాజిగిరి డీసీ రాజు, అల్వాల్ డీసీ నాగమణి, తహశీల్దార్లు వెంకటేశ్వర్లు, నాగలక్ష్మీ, డీఆర్‌డీఏ యాదయ్య, ఏసీపీ గజానంద్, ఎస్‌ఈ అనిల్ రాజ్, డీఈలు మహేష్, లౌక్య, పీఓ మల్లికార్జున్, బిఆర్‌ఎస్ అధికార ప్రతినిధి జీఎన్‌వీ సతీష్‌కుమార్, సర్కిల్ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, మీడియా ఇన్‌ఛార్జి గుండా నిరంన్, డివిజన్‌ల అధ్యక్షులు తులసీ సురేష్, సత్తయ్య, పీవీ సత్యనారాయణ, నోరి, సత్యమూర్తి, నాయకులు ఉపేందర్‌రెడ్డి, భాగ్యానంద్‌రావు, నయూమ్ ఖాన్, బాబు, సత్యనారాయణ, సంతోష్ రాందాసు, బాలకృష్ణగుప్తా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News