జవహర్‌నగర్: మానసికంగా, శారీరక వేధింపులకు పాల్పడుతున్న భర్తపై భార్య జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్‌స్పెక్టర్ కె.సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… ఆముల సుదర్శన్‌కు ఎ.నాగశ్రీతో గత 25 సంవత్సరాల క్రితం వివాహం జరగ్గా వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా కొద్ది కాలంగా భర్త ఇతర స్త్రీలతో వివాహేతర సంబంధాలు పెట్టుకొని తనను, పిల్లలను నిర్లక్షం చేస్తు శారీరకంగా, మానసికంగా వేధిస్తు తీవ్ర హింసలకు గురిచేస్తున్నాడని పేర్కొంది.
అర్ధరాత్రి మద్యం సేవించి తనను కొట్టడమే కాకుండా అసభ్యపదజాలంతో దూషిస్తు మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఈ విషయంలో తన అత్త ఆముల బాల నర్సమ్మ సైతం భర్తను ప్రోత్సహిస్తుందని తెలిపింది. అంతేగాకుండా తనకు విడాకులు ఇవ్వాలంటూ భర్త డిమాండ్ చేస్తున్నట్లు బాధితురాలు ఎ. నాగశ్రీ శుక్రవారం జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ సీతారాం తెలిపారు.