అబ్దుల్లాపూర్‌మెట్: పశువులను అక్రమంగా రవాణా చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అబ్దుల్లాపూర్‌మెట్ సిఐ ఎ.మన్మోహన్ తెలిపారు. గత వారం రోజులుగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం కొత్తగూడం ఎక్స్‌రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌లో సిఐ మ న్మోహన్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై ఐదు కేసులు 13మంది నమోదు చేశామని తెలిపారు.
అక్రమంగా రవాణ చే స్తున్న 83 ఆవులు, 103 ఎద్దులు, 11 లేక దూడలును సంరక్షణ నిమిత్తం గోషాలకు తరలించామని తెలిపారు. ఎలాంటి అనుమతులేకుండా క్రూరంగా, హింశాత్మకంగా తరలిస్తున్న ఐ దు వాహనాలు (లారీ, డిసిఎం, బోలేరో)ను, నేరం చేసే సమయంలో ఉపయోగించిన సెల్ ఫోన్స్‌లను స్వాదీనం చేసుకొని కోర్టులో హజరుపర్చామని తెలిపారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు : సిఐ మన్మోహన్
ఎవరైన పశువులను అక్రమ రవాణా చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయడం జరుగుతుంది. ఇలా తరుచుగా అక్రమంగా పశువులు రవాణా చేస్తే పిడి యాక్డ్ నమోదు చేస్తామన్నారు. ఎవరైన పశువులను రవా ణా చేసే ముందు పశు వైద్యాధికారితో అనుమతి తీసుకొని యానిమల్ యాక్ట్ నిబంధనల ప్రకారం రవాణా చేయలన్నారు. పశువుల రవాణా చేసే సమయంలో ఏ రైతు వద్ద ఎక్కడ కొనుగోలు చేసినారు,
అక్కడ సంబంధిత గ్రామ పంచాయతీ అనుమతి రశీదులు తప్పని సరిగా చూపించాలని అన్నారు. కేవలం ఆవుల అనే కాదు, ఎద్దులు కూడా నిబంధనలకు లోబడి మాత్రమే రవాణా చేయాలి. పశువులు రవాణా చేసినప్పుడు వాటిని ఇరుకుగా హింశాత్మకంగా గాలి వెలుతురు తగలకుండా రవాణా చేస్తే చట్ట పక్రారం కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. పశువుల అక్రక రవాణా సమాచారం వస్తే పోలీస్టేషన్ ఫోన్-8712662650, పెట్రోల్ మొబైల్ ఫోన్ నంబర్-8712662651/652కు సమాచారం అందించాలని సూచించారు. అంతే కాని ఎరైన అక్రమ రవాణా అడ్డుకొని వా రితో అనవసరంగా గొడవ చేస్తే వారి పై కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరగుతుందని తెలిపారు. అక్రమ రవాణా నివారణకు పోలీసులకు సహకారించాలని కోరారు.