Sunday, November 17, 2024

తెలంగాణ ఏర్పాటుతో మారుతున్న హైదరాబాద్ రూపురేఖలు

- Advertisement -
- Advertisement -

హస్తినాపురం: తెలంగాణ రాష్ట్రం వచ్చాక అద్భుతమైన అభివృద్ధి పనులు జరుగుతూ హైదరాబాదు మహానగరం రూపురేఖలు మారిపోతున్నాయని ఎల్‌బినగర్ ఎమ్మెల్యే మూసీనది అభివృద్ధి సంస్త ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. కేటిఆర్ ఆలోచనలు, కేసిఆర్ ఆమోదాలతో 2014 సంవత్సరం నుండి ఈనాటి వరకు పరిశీలిస్తే ఎంతో అందమైన పట్టణంగా తీర్చిదిద్దబడుతున్నదన్నారు. హైదరాబాదు అందాలకు ఆకర్షితులైన బెంగుళూరు, మహరాష్ట్ర తమిళనాడు తదితర చుట్టుపక్కల వారు హైదరాబాదుకు వచ్చి స్థిరపడుతూ ఫిదా అవుతున్న విషయమే చక్కటి ఉదాహరణ అని ఆనందం వెలిబుచ్చారు.

మూసీ నదిలో 120 అడుగుల వెడల్పుతో కొత్తగా రోడ్డు నిర్మించేందుకు భవిష్యత్తు ప్రణాళిక సిద్దం చేశామన్నారు. తెలంగాణ విజయోత్సవాలు, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు ఎస్‌ఆర్‌డి ప్రాజెక్టు అధికారులు ఎల్‌బినగర్ బైరామల్‌గూడ ఫ్లైఓవర్ స్కై ఓవర్ బ్రిడ్జిలపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్‌ఆర్‌డిపి డిఇఇ కార్తీక్ ఆధ్వర్యాన ఎల్‌బినగర్ జిహెచ్‌ఎంసి డిప్యూటి కమీషనర్ అధ్యక్షతన జరిగిన ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జరుగుతున్న స్కైఓవర్ బ్రిడ్జినిర్మాణం పనులను పరిశీలించి రింగు రోడ్డు జంక్షన్ చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రసంగిస్తూ మరో రెండు నెలల్లో బైరామల్‌గూడ సర్కిల్ గుర్తుపట్టలేని అందమైన జంక్షన్‌గా మారబోతున్నదని తెలిపారు.

గతంలో ముక్కుమూసుకొని వెళ్లిన ప్రజలు ఇప్పుడు పార్కులా భావించి సేదతీర్చుకునేలా మారుతున్నదన్నారు. బాలీవుడ్, తాలివుడ్ సినిమాల వారు ఎల్‌బినగర్‌లో షూటింగులు చేసే విధంగా తయారై భవిష్యత్తు తరాలు గర్వంగా చెప్పుకునే రోజులొస్తున్నాయన్నారు.
కరోనా లాక్ డౌన్లో రోడ్ల వెడల్పుకు చేసిన తన ప్రణాళికలు, 2020, 2021 సంవత్సరంలో కురిసిన భారీ వర్షాలకు మునిగిపోయిన కాలనీలు, కొట్టుకపోయిన మనుషుల గురించి తాను వెయ్యి పేజీల డాక్యుమెంటు తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేశానని వివరించారు. తన డాక్యుమెంటరీ చాలా బాగుందని కొనియాడిన కేసిఆర్ ఇలా ముందు చూపు ప్రణాళిక ఉండాలని కొనియాడిన కేసిఆర్ వెంటనే కేటిఆర్‌కు ఆదేశించి సుధీర్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా నిధులు మంజూరు చేసి సమస్యల పరిష్కారానికి సహకరించాలని తెలిపినందున ఇపుడు ఎల్‌బినగర్ రూపురేఖలు మారుతున్నాయన్నారు.

ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, పైపు లైన్లు రోడ్ల వెడల్పులు 80 శాతం పనులు జరిగినందున ఇక నుండి వర్షపు నీటి సమస్య, డ్రైనేజి సమస్య ట్రాఫిక్ సమస్య ఉండదని ఆశాభావం తెలిపారు. హస్తినాపురం బిఆర్‌ఎస్ అధ్యక్షులు సత్యంచారి, బిఆర్‌ఎస్ నాయకులు గజ్జెల మధుసూధన్‌రెడ్డి, నల్ల రఘుమారెడ్డి, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్కైఓవర్‌పై పెద్ద స్తాయి అందమైన మెరుపులతో సదస్సు నిర్వహించి ఆకట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News