Friday, November 1, 2024

‘డ్రైనేజీ సమస్య పరిష్కరిస్తా : ఎమ్మెల్యే మైనంపల్లి

- Advertisement -
- Advertisement -

మౌలాలి : మౌలాలి జెడ్‌టీఎస్ గ్రౌండ్ వెనుక భాగంలోని హనుమాన్‌నగర్‌లో సాధ్యమైంతన త్వరగా డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు స్ధానికులకు హమీనిచ్చారు. శుక్రవారం ఆయన, అధికారులతో కలిసి హనుమాన్‌నగర్‌లో పర్యటించి స్ధానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ధానికులు తనకు విన్నవించిన సమస్యను పరిష్కరిస్తానని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మల్కాఙిగిరి సర్కిల్ ఉప కమిషనర్ రాజు, డీఈ మహేష్, ఏఈ మధురిమ, జలమండలి జీఎం సునిల్‌కుమార్, నాయకులు పిట్ల నాగరాజు, అమీనుద్ధీన్, ఇబ్రహ్మీం, ఉషశ్రీ, ఆదినారాయణ, సంతోష్‌గుప్తా, బుద్ది నర్సింగ్‌రావు, షకిల్, నవాబ్, జబ్బార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News