ముషీరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వార్డు కార్యాలయం ద్వారా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని, తద్వారా ప్రజా సమస్యలు మరింత వేగంగా పరిష్కారం అవుతాయని ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ అన్నారు. జీహెచ్‌ఎంసీ ముషీరాబాద్ సర్కిల్ పరిధిలోని గాంధీనగర్ డివిజన్ వార్డు కార్యాలయాన్ని చిక్కడపల్లి మీసేవా భవనంలో ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, స్థానిక కార్పొరేటర్ పావని వినయ్‌కుమార్, జీహెచ్‌ఎంసీ డిఎంసి డాక్టర్ తిప్పర్తి యాదయ్యతో కలిసి ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజూ స్థానిక వార్డు ప్రజలకు వివిధ శాఖలకు చెందిన అధికారులు, సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉంటార న్నారు. దీంతో సమస్యను పరిష్కరించడంలో జరిగే జాప్యాన్ని నివారించడానికే ప్రభుత్వం ఈ కొత్త తరహా విధానానికి శ్రీకారం చుట్టినట్టు తెలిపా రు. కార్పొ రేటర్ పావని వినయ్ కుమార్ మాట్లాడుతూ ముషీరాబాద్ నియోజకవర్గంలో గాంధీ నగర్ డివిజన్‌ను రోల్ మోడల్ అయ్యేలా తీర్చిది ద్దుతానన్నారు. కార్యక్రమంలో వార్డు అడ్మినిస్ట్రేటివ్ అధికారి ప్రవీణ్ చంద్ర, అసిస్టెంట్ ఇంజినీర్, అబ్దుల్ సలామ్, యూడిసి ఆర్‌పి విజయలక్ష్మీ, టౌన్ ప్లానింగ్ సైట్ ఇంజినీర్ దాసరి హర్షిత, బిజేపి డివిజన్ అధ్యక్షులు రత్నసాయి చంద్, దామోదర్, శ్రీకాంత్, ఆకుల సురేందర్, నవీన్ కుమా ర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. కవాడిగూడ తాళ్లబస్తీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కవాడిగూడ డివిజన్ వార్డు కార్యాలయాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, కార్పొరేటర్ రచనశ్రీతో పాటు వివిధ శాఖల అధికారులు, బిఆర్‌ఎస్, బిజేపి పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.