Monday, December 23, 2024

ప‌వ‌న్‌పై మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: రాష్ట్రంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని వైఎస్ఆర్ సిపి మంత్రి దాడిశెట్టి రాజా వెల్లడించారు. 2014-2019 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఎంటో తెలుసా? అని ప్రశ్నించారు. తప్పులు, పాపాలు నువ్వుచేసి మమ్మల్నిఅంటే ప్రజలెవ్వరూ ఒప్పుకోరని మంత్రి దాడిశెట్టి వెల్లడించారు. పవన్ దగ్గర పనిచేసిన ఓ గన్ మెన్ మీ వీర మహిళలను వేధించాడు. దానికి పవన్ కళ్యాణ్ బాధ్యత తీసుకుంటాడా? అని మంత్రి ప్రశ్నించాడు.

మీడియా సమావేశంలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ… జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై మంత్రి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.  పవన్ ను పార్టీ నాయకులు, కార్యకర్తలు మానసిక వైద్యుడికి చూపించాలని సూచించారు. పవన్ గంటలో నిర్ణయం.. పూటకో మాట మాట్లాడుతున్నారని మంత్రి రాజా వెల్లడించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు సభలు ప్లాప్ అయ్యాయన్నారు. ఉమ్మడి తూ.గో జిల్లాలో ప్రజలు ఛీ కొడితే.. రాష్ట్రంలో ఎక్కడ సభలు పెట్టిన జనం రారని ఆయన జోస్యం చెప్పారు.

సభలకు జనం రాకపోతే నీ యజమాని ప్యాకేజీ ఇవ్వడు అని ఆయన ఎద్దేవా చేశారు. ఎక్కడ పోటీ చేస్తాడో పవన్ కే క్లారిటీ లేదన్న మంత్రి రాజా, పవన్ ఎమ్మెల్యే అవ్వాలన్నా.. సిఎం అవ్వాలన్నా ప్రజలు ఓట్లు వెయ్యాలని సూచించారు. 2014-19లో టిడిపి, పవన్, బిజెపి కలిసి మేనిఫెస్టో రూపొందించారు. మేనిఫెస్టో హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబును నిలదీశావా పవన్ అని మంత్రి దాడి శెట్టి ప్రశ్నించారు. చంద్రబాబు ప్యాకేజీ సరిగా ఇవ్వడేమోనని అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నావన్నారు.

అమరావతిలో 45 ఆలయాలు టిడిపి ధ్వంసం చేస్తే వైసిపి పునర్ నిర్మిస్తోందని ఆయన వెల్లడించారు. రాజమండ్రిలో విఘ్నేశ్వర విగ్రహాన్ని అపవిత్రం చేసింది టిడిపి నాయకులేనని ఆరోపించారు. ఓ లారీ ఎక్కి పవన్ ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు.. పవన్ కు బాధ్యత లేదని ఆయన విమర్శించారు. పవన్ బాబా అవతారం ఎత్తి అమరావతి కోసం మాట్లాడతాడని రాజా వెల్లడించారు.

చంద్రబాబు, పవన్ లు ఫ్యామిలితో కలిసి ఓ రోజైనా అమరావతిలో గడిపారా? అని దాడిశెట్టి ప్రశ్నించారు. టిడిపి పాలనలో మరుగుదొడ్ల నిర్మాణంలో నియోజకవర్గంకు రూ. 20 కోట్లు చొప్పున దోచేశారని మంత్రి స్పష్టం చేశారు. 2014-19లో టిడిపి, బిజెపి, పవన్ ల పాలనలో నియోజకవర్గానికి రూ. 20 కోట్లు దోచేశారని మంత్రి దాడిశెట్టి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News