లక్నో: మాఫియాపై ఉత్తరప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మళ్లీ చర్యలకు పూనుకుంది. గోరఖ్‌పూర్‌కు చెందిన మాఫియా నేత వినోద్ ఉపాధ్యాయ్ నివాసం వద్ద గోరఖ్‌పూర్ జిల్లా యంత్రాంగం శనివారం నాడు ఆక్రమణల డ్రైవ్ చేపట్టింది. మాఫియా వినోద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయనపై ప్రభుత్వం రూ. 50 వేలు వరకు నగదు బహుమతి ప్రకటించింది.
వినోద్ ఉపాధ్యాయ్‌పై నాలుగు హత్యకేసులుతోసహా మొత్తం 32 కేసులు నమోదై ఉన్నాయని, ప్రభుత్వ భూమితోపాటు తన నివాసానికి ఆనుకుని ఉన్న ప్లాట్‌ను కూడా ఆక్రమించుకున్నాడని సిటీ ఎస్పీ క్రిష్ణన్ బిష్ణోయ్ మీడియాకు చెప్పారు. ఆక్రమిత ప్రభుత్వ భూమిని గోరఖ్‌పూర్ డెవలప్ అథారిటీ గుర్తించి కూల్చివేతలు చేపట్టినట్టు తెలిపారు. ఉపాధ్యాయ్ కోసం గాలిస్తున్నామని , అతని అరెస్టు కోసం ప్రకటించిన రివార్డు మొత్తాన్ని ఇంకా పెంచుతామని చెప్పారు.
#WATCH | Uttar Pradesh | Gorakhpur district administration carries out a demolition drive at the residence of mafia Vinod Upadhyay in Gorakhpur.
Upadhyay is currently on the run and has a reward of Rs 50,000 on him. pic.twitter.com/eWfauDRA3W
— ANI UP/Uttarakhand (@ANINewsUP) June 17, 2023